• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌లో 60.84 శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌:  నీట్‌ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్‌ 4న వెల్లడించింది.  తెలంగాణ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 60.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, 77,849 మంది పరీక్ష రాశారు. వారిలో 47,371 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ఈసారి 100లోపు ర్యాంకుల్లో కేవలం ఒకటి మాత్రమే దక్కింది. హైదరాబాద్‌ నుంచి పరీక్ష రాసిన అనురన్‌ ఘోష్‌ 77వ ర్యాంకు సాధించాడు. మే 5వ తేదీన నీట్‌ యూజీ జరిగింది. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్‌ 4న వెల్లడించింది. 

67 మందికి సమాన పర్సంటైల్‌

దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌ (99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. వారిలో 14 మంది అమ్మాయిలు, 53 మంది అబ్బాయిలు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు. రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా 11 మంది విద్యార్థులున్నారు.

జనరల్‌కు కటాఫ్‌ మార్కులు 164

పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్‌ విభాగం విద్యార్థులకు కటాఫ్‌ మార్కులను 164గా నిర్ణయించారు. అంటే 164 మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు. ఇక బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు 129, ఈడబ్ల్యూఎస్‌కు 146 మార్కులు తప్పనిసరి.

ఎస్‌టీ కేటగిరీలో టాప్‌ ర్యాంకు 167

ఎన్‌టీఏ కేటగిరీల వారీగా టాప్‌ 10 ర్యాంకులను ప్రకటించింది. ఎస్‌టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుగులోతు వెంకట నృపేష్‌ 167వ ర్యాంకు, లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌ 453వ ర్యాంకు సాధించి దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాలు సాధించిన వారి జాబితాలో నిలిచారు.

అభ్యర్థులు పెరిగారు...  ఉత్తీర్ణతా పెరిగింది

గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రాష్ట్రం నుంచి పోటీపడిన అభ్యర్థుల సంఖ్య పెరగగా, ఉత్తీర్ణత శాతమూ పెరగడం విశేషం. పోయిన సంవత్సరం 72,842 మంది పరీక్ష రాయగా 42,654 మంది (58.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 77,849 మంది పరీక్ష రాయగా 47,371 మంది (60.84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జాతీయ సగటు ఉత్తీర్ణత 56.41 శాతం ఉంది. అంటే  రాష్ట్ర విద్యార్థులు దాదాపు నాలుగున్నర శాతం అధికంగా పాసయ్యారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.