• facebook
  • whatsapp
  • telegram

TGPSC: గ్రూప్-2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం చర్చలు

* పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు
 


హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చిస్తున్నారు. డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల మధ్య వారం రోజుల మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని మార్చి నెలలో కమిషన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రూప్‌-2 ఉద్యోగాలకు 5.51లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.