• facebook
  • whatsapp
  • telegram

Jobs: ఇన్ఫోసిస్‌లో 20 వేల‌ ఉద్యోగాలు 

* 2024-25లో తాజా ఉత్తీర్ణులకే
 

‘‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని బలమైన త్రైమాసికంతో ప్రారంభించాం. వృద్ధి, నిర్వహణ మార్జిన్, పెద్ద ఒప్పందాలు, అత్యధిక నగదు.. ఇలా అన్ని విషయాల్లోనూ రాణించాం. మా వైవిధ్యభరిత సేవలపై ఖాతాదార్లకు ఉన్న అపార నమ్మకం.. ఆర్డర్లను మేం సమర్థంగా నిర్వహించడం వల్లే ఇది సాధ్యమైంది.’’

* ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ జూన్‌ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ అంచనాలను పెంచడం మరో విశేషం. వృద్ధికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000-20,000 మందిని కళాళాల ప్రాంగణాల నుంచి నియమించుకుంటామని తెలిపింది. గురువారమిక్కడ కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం..

లాభంలో 6% వృద్ధి: ఏప్రిల్‌-జూన్‌లో రూ.6,368 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.5,945 కోట్లతో పోలిస్తే ఇది 6% అధికం. మార్చి త్రైమాసిక లాభం రూ.7,969 కోట్లతో పోలిస్తే మాత్రం ఇది 20% తక్కువ. 

విభాగాల వారీగా: ఇన్ఫోసిస్‌కి అధికంగా ఆర్జించి పెట్టే ఆర్థిక సేవల విభాగం 0.3% తగ్గి 27.5 శాతానికి పరిమితమైంది. రిటైల్‌ విభాగ వాటా 3% కోల్పోయి 13.8 శాతానికి చేరింది. కమ్యూనికషన్‌ విభాగం మాత్రం 5.4% పెరిగి 12.1 శాతానికి; ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్, సేవల వాటా 6.3% పెరిగి 13.3 శాతానికి చేరుకుంది. ఉత్తర అమెరికా నుంచి వచ్చే ఆదాయం వాటా 1.2% తగ్గగా.. ఐరోపా వాటా 9.1% పెరిగింది. 

*నియామకాలు బాగుంటాయ్‌

వరుసగా 6 త్రైమాసికాల పాటు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం, ఇతర దిగ్గజ ఐటీ కంపెనీల తరహాలోనే తాజా ఉత్తీర్ణులను అధికంగానే నియమించుకుంటామని తెలిపింది. 2024-25లో 15,000-20,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకోసం ప్రాంగణ, ప్రాంగణేత (ఆఫ్‌ క్యాంపస్‌) ఎంపికలు నిర్వహిస్తామని సీఎఫ్‌ఓ జయేష్‌ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. గతంలో ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన అందరినీ కంపెనీలోకి రప్పించినట్లు తెలిపారు. కంపెనీలో జూన్‌ త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. నికరంగా 1,908 మంది బయటకు వెళ్లడంతో జూన్‌ చివరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,15,332కు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 20,962 మంది తగ్గినట్లు లెక్క. ఉద్యోగుల వినియోగ స్థాయి ఏడాది కిందటితో పోలిస్తే 78.9% నుంచి 83.9 శాతానికి పెరిగింది.
బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు 1.93% లాభపడి, రూ.1759.15 వద్ద స్థిరపడింది.



 


మరింత సమాచారం... మీ కోసం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.