ఈనాడు, అమరావతి: కన్వీనర్ కోటా ఎంటెక్ ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే అమల్లో ఉంటాయని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 178 కళాశాలలకు ఫీజులను నిర్ణయించింది. కనిష్ఠం రూ.50వేలు కాగా.. గరిష్ఠంగా రూ.90వేల ఫీజును నిర్ణయించింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండగా.. ప్రైవేటు కళాశాలల్లో చేరేవారికి ఎలాంటి ఫీజు చెల్లింపులు ఉండవు. బీటెక్కు కనీస ఫీజును రూ.40వేల నుంచి రూ.43వేలకు పెంచింది. కనిష్ఠం రూ.43వేలు, గరిష్ఠం రూ.1.05 లక్షలుగా నిర్ణయించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.