ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను జులై 19న కేటాయించనున్నారు. జులై 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గడువు జులై 17న రాత్రి వరకు ఉండగా.. అప్పటివరకు ఎంత మంది అన్నది ప్రవేశాల కమిటీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. దాదాపు 96 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కన్వీనర్ కోటాలో 72,741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీఎస్ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.