• facebook
  • whatsapp
  • telegram

UPSC Exams: పరీక్షల్లో అక్రమాలకు చెక్‌.. ‘ఏఐ సాంకేతికత’కు యూపీఎస్సీ సిద్ధం!


 

దిల్లీ: నీట్‌, నెట్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కీలక చర్యలకు ఉపక్రమించింది. సంస్థ నిర్వహించే వివిధ పరీక్షల్లో చీటింగ్‌ను నిరోధించేందుకు ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవాలని నిర్ణయించింది. ఈ సాంకేతికతల కోసం అనుభవమున్న ప్రభుత్వరంగ సంస్థల బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.

కేంద్ర సర్వీసు ఉద్యోగుల నియామకాల కోసం యూపీఎస్సీ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో సహా దాదాపు 14 కీలక పరీక్షలను నిర్వహిస్తుంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు. వీటిని పర్యవేక్షించడంతోపాటు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ క్రమంలోనే ఆధార్‌-ఆధారిత వేలిముద్రల ధ్రువీకరణ, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్‌ కార్డుల క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోనుంది.

పరీక్ష కేంద్రంలోని ప్రతి గది (24 అభ్యర్థులకు ఒకటి చొప్పున)లో, ప్రవేశ/నిష్ర్కమణ గేట్లు, కంట్రోల్‌ రూమ్‌ల వద్ద.. ఇలా అవసరమైన చోట కెమెరాలను ఏర్పాటు

కెమెరాలు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయినా, పరీక్షకు ముందు, ఆ తర్వాత గంట వరకు గదిలో ఎటువంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా, పరీక్ష వ్యవధి ముగిసిన తర్వాత ఇన్విజిలేటర్‌ అక్కడ నుంచి కదలకున్నా.. వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేసే సాంకేతిక వ్యవస్థ

చీటింగ్, అక్రమాలు జరిగినా, ఇన్విజిలేటర్‌ లేని సమయంలో ఏఐ వెంటనే అలెర్ట్‌ ఇచ్చేలా ఏర్పాటు

అభ్యర్థులు అవకతవకలకు పాల్పడే అవకాశాలను అడ్డుకోవడం, పరీక్షల ప్రక్రియను పటిష్ఠపరిచే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.