• facebook
  • whatsapp
  • telegram

TG Genco: రాత పరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రం మార్పు!

* జెన్‌కో నిర్ణయం
 


ఈనాడు, హైదరాబాద్‌: రాత పరీక్షకు ఒక్కరోజు ముందు పరీక్ష కేంద్రం మార్పు జరిగింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాన్ని మార్చినట్లు జెన్‌కో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కె.పి.ఎం టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ అనే పరీక్ష కేంద్రం పేరుతో ఇప్పటికే కొందరు అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేశామని, కానీ సాంకేతిక కారణాలతో వారందరినీ హైదరాబాద్‌ వినయ్‌నగర్‌లోని భోజ్‌రెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ, నాదర్‌గుల్‌లోని ఎం.వి.ఎస్‌.ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పరీక్ష కేంద్రాలకు మార్చినట్లు తెలిపింది. ఉదయం 9 నుంచి 10.40 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు పరీక్ష రాయాల్సిన అభ్యర్థులను భోజ్‌రెడ్డి కాలేజీకి, మధ్యాహ్నం 1 నుంచి 2.40 వరకు పరీక్ష రాయాల్సిన వారిని ఎం.వి.ఎస్‌.ఆర్‌ కాలేజీ కేటాయించినట్లు ప్రకటించింది. కొత్త పరీక్ష కేంద్రాల పేరుతో హాల్‌టిక్కెట్లను జెన్‌కో వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.