• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AP Models School: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు 

ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 162 మోడల్ స్కూల్స్‌లో ఎంపీసీ/ బైపీసీ/ ఎంఈసీ/ సీఈసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన ఉంటుంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. వీటిలో విద్యనభ్యసించేందుకు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి/ మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు.

వివరాలు...

* ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు-2024

ప్రవేశాలు కల్పించే ఇంటర్‌ గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: పదోతరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు… 

అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ: 26.03.2024.

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.05.2024.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా వెల్లడి: 23.05.2024.

మెరిట్ జాబితా వెల్లడి: 24.05.2024.

ఎంపిక జాబితా వెల్లడి: 25.05.2024.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 27.05.2024.

తరగతుల ప్రారంభం: 01.06.2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :