• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICAR: ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2024

2024-25 విద్యా సంవత్సరానికి వ్యవసాయ సంబంధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 11న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి మే 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష వివరాలు:

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌(ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ)-2024

విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, వాటర్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 31.08.2024 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. 

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120.

దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్‌ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.625.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్/ రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 11-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 13.05.2024 నుంచి 15.05.2024 వరకు.

పరీక్ష తేదీ: 29.06.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :