• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS PGECET: టీఎస్‌ పీజీఈసెట్‌ - 2024 

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 16 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు జూన్‌ 6 నుంచి 9వ తేదీ వరకు ప్రవేశ పరీక్ష జరుగనుంది.

పరీక్ష వివరాలు…

* తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024

కోర్సులు: ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి

విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ప్రాంతీయ కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.

ముఖ్య తేదీలు… 

మార్చి 12: నోటిఫికేషన్‌ జారీ.

మార్చి 16 నుంచి మే 10 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం

మే 14-25: రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం

మే 28 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం

జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు: 19 సబ్జెక్టులకు పరీక్షలు

 

దరఖాస్తు చివరి తేదీ: 31-03-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎస్‌ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?

‣ మాంగనీస్‌ ఓర్‌ ఇండియాలో ట్రెయినీలు  

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :