• facebook
  • whatsapp
  • telegram

కాలుష్య కట్టడికి సౌరశక్తి

మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యకాంతిని ఉపయోగించి పిండిపదార్థాలు, చక్కెరను తయారు చేసుకుంటాయి. మానవుడు కూడా సౌర ఘటాల సాయంతో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చుకొంటున్నాడు. సూర్యకాంతి అనంత పునరుత్పాదక ఇంధన వనరు. అది చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల మాదిరిగా కాలుష్యాన్ని వెదజల్లదు. కాబట్టి సౌర విద్యుత్తు ఉత్పత్తికి   మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే!

‘భారతదేశం హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన వనరుల సంస్థ (టెరి) సారథ్యంలో దిల్లీలో ఫిబ్రవరి 22న జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సభలో ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో భారత్‌ పునరుత్పాదక ఇంధన వనరులతో 500 గిగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పాటు అందిస్తామని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యావరణ మంత్రి సుల్తాన్‌ అల్‌ జబార్‌ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనాల్లో అగ్రాసనం సౌర విద్యుత్తుదే. సమృద్ధిగా సూర్యకాంతి ప్రసరించే భారతదేశం గడచిన నాలుగేళ్లలో సౌర విద్యుత్‌ ఉత్పాదనలో గణనీయంగా పురోగమించింది. 2021లో తన మొత్తం స్థాపిత విద్యుదుత్పాదన సామర్థ్యానికి అదనంగా 10 గిగావాట్ల సౌర విద్యుత్తును జతచేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ. 2030కల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని సముపార్జించాలనుకొంటున్న భారత్‌, అందులో 60 శాతం సౌరశక్తి ద్వారానే సాధించాలనుకొంటోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే రాగల పదేళ్లలో ఏడాదికి 25 గిగావాట్ల సౌర విద్యుదుత్పాదన సామర్థ్యం చొప్పున అదనంగా చేర్చుకొంటూ పోవాలి. సౌర ఘటాలతో కూడిన సోలార్‌ ప్యానెళ్లు విద్యుదుత్పాదనకు కీలకం. 100 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానెళ్లను విదేశాలకు ఎగుమతి చేసే సత్తాను భారతీయ పరిశ్రమలు సంతరించుకోనున్నాయి. భారత్‌ 2026 నుంచి విదేశాలకు సౌర విద్యుత్తునూ ఎగుమతి చేయగలుగుతుంది.

ఖరీదైన ప్రక్రియ

గత ఏడాది చివరి నాటికే భారత్‌ సౌర, పవన, బయోమాస్‌, మినీ జలవిద్యుత్కేంద్రాల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని సాధించాల్సింది. కానీ, వాస్తవంలో 122 గిగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే సంపాదించగలిగింది. అందులో 100 గిగావాట్లుగా ఉండాల్సిన సౌర విద్యుత్‌ 62 గిగావాట్లకు పరిమితమైంది. సోలార్‌ ప్యానెళ్ల ధర బాగా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. సౌర ప్యానెళ్ల తయారీకి పాలీ సిలికాన్‌ వేఫర్లు అవసరం. వీటి కోసం భారత్‌ మొదటి నుంచీ చైనా దిగుమతుల మీద ఆధారపడుతోంది. ఈ దిగుమతులపై భారీగా కస్టమ్స్‌ సుంకం విధించినందువల్ల గిరాకీకి తగిన సరఫరా లేదు. ఈ వేఫర్లను స్వదేశంలోనే తయారు చేయడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. వేఫర్‌ పరిశ్రమలు స్వదేశంలో నెలకొంటే తప్ప సౌర విద్యుదుత్పాదనలో భారత్‌ స్వయంసమృద్ధి సాధించలేదు. కానీ, సోలార్‌ ప్యానెళ్లు, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ఘటాల తయారీకి భారత్‌లో తగిన మౌలిక వసతులు లేవు. నిపుణ సిబ్బందీ దొరకడం లేదు. ఫలితంగా సోలార్‌ ప్యానెళ్ల తయారీ చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. సోలార్‌ ప్యానెళ్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడానికి సువిశాల క్షేత్రాలు కావాలి. తక్కువ విస్తీర్ణంలో కొద్ది సోలార్‌ ప్యానెళ్లతోనే అత్యధిక సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పరిశోధన-అభివృద్ధి జరగాలి. దీనిపై ఎక్కువ పెట్టుబడులు వెచ్చించి నవీకరణలు సాధించాలి. పగటిపూట పొలాలకు నీరు పెట్టడానికి సౌర ప్యానెళ్లను ఉపయోగిస్తే సర్కారుకు విద్యుత్‌ రాయితీల భారం తగ్గుతుంది. కర్బన కాలుష్యమూ తగ్గుతుంది. సౌర విద్యుత్‌ వినియోగానికి రైతులకు నిధులు ఇవ్వడానికి కేంద్రం ప్రధానమంత్రి-కుసుమ్‌ పథకం చేపట్టినా, నిధుల కొరత వల్ల అది నత్తనడకతో సాగుతోంది. పీఎం-కుసుమ్‌ పథకం కోసం కేంద్రం నిధులు  కేటాయించాల్సి ఉంది. రైతులు సోలార్‌ ప్యానెళ్లను సమకూర్చుకోవడం కోసం ఈ నిధులను వెచ్చించాలని ఉద్దేశించారు. ఈ ప్యానెళ్ల ద్వారా 10,000 మెగావాట్ల విద్యుదుత్పాదన సాగించాల్సి ఉంది. 20 లక్షల సౌర పంపులను అమర్చి సాధారణ విద్యుత్‌ గ్రిడ్‌ మీద ఒత్తిడి తగ్గించాలని లక్షించారు. గ్రిడ్‌తో అనుసంధానమైన 15 లక్షల పంపులను సౌర పంపులుగా మార్చాలని తలపెట్టారు. ఈ లక్ష్యాలను సాధించడంలో నిధుల కొరత వంటి అడ్డంకులను అధిగమించాల్సి ఉంది.

ప్రభుత్వ ప్రోత్సాహం

భారత్‌, ఫ్రాన్స్‌ కలిసి 2015లో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ)ని ప్రారంభించాయి. సోలార్‌ పార్కులతోపాటు వాణిజ్య భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్ల పైకప్పుల మీద సోలార్‌ ప్యానెళ్లతో సౌర విద్యుదుత్పాదనను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులు ఇస్తోంది. ముడి సరకులపై సుంకాలు తగ్గిస్తోంది. పరిశోధన-అభివృద్ధిపై పెట్టుబడులు పెడుతోంది. ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలిగే సోలార్‌ ప్యానెళ్లను, ఇతర సామగ్రిని తయారు చేయడంపై భారతీయ పరిశ్రమలు దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన ప్యానెళ్లకు ప్రభుత్వం ధ్రువీకరణ ఇవ్వాలి. సౌర విద్యుత్‌ ఎగుమతికి కావలసిన మౌలిక వసతులనూ నిర్మించాలి. ఈ రంగంలో ఇతర దేశాలతో కలిసి పని చేయాలి. భారతీయ పరిశ్రమలు అంతర్జాతీయ సౌర ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడానికి ప్రోత్సాహం, సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం సోలార్‌ ప్యానెళ్ల తయారీకి వాడుతున్న ఘటాలు 22 శాతం సౌరశక్తిని మాత్రమే విద్యుత్తుగా మార్చగలుగుతున్నాయి. కొన్నిరకాల ఘటాలు 27 శాతం సామర్థ్యాన్ని అందుకొంటున్నాయి. నానోవైర్‌ సోలార్‌ ప్యానెళ్లకూ అధిక విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. జలాశయాలపై తేలియాడే సౌర ప్యానెళ్లతో, సౌర శక్తిని ఒడిసిపట్టే వృక్షాలతో, బయో సోలార్‌ ఘటాలతోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలా బహుముఖీన సౌర విద్యుదుత్పాదనకు ప్రభుత్వం రెట్టింపు కృషి జరపాల్సిన అవసరం ఉంది.

అడ్డంకులెన్నో..

ప్రస్తుతం ఒక మెగావాట్‌ సౌర విద్యుదుత్పాదనకు నాలుగు ఎకరాల భూమి అవసరం. ఈ లెక్కన గిగావాట్ల స్థాయిలో ఉత్పత్తికి మరెంతో భూమి కావాలి. అన్నిచోట్లా ఇందుకు భూములు లభ్యంకావు. భారీ సోలార్‌ పార్కుల స్థాపనకు రుణ సౌకర్యమూ తక్కువే. జాతీయ శుద్ధ ఇంధనం, పర్యావరణ నిధి తదితర పథకాలతో కేంద్రం సమస్యను కొంతమేరకు పరిష్కరించగలిగినా, జరగాల్సింది చాలా ఉంది. భారత్‌లో తయారవుతున్న సోలార్‌ ప్యానెళ్ల నాణ్యత సంతృప్తికరంగా లేదు. 2050కల్లా భారత్‌లో సౌరవ్యర్థాలు 18లక్షల టన్నులకు పెరుగుతాయని అంచనా. వీటిని సమర్థంగా నియంత్రించాల్సి ఉంది.
 
********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళా సమానత్వమే పరమావధి

‣ ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి జోరు

‣ సముద్ర సహకారంలో చెట్టపట్టాల్‌!

‣ భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

Posted Date: 18-03-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం