దేశాల సమగ్రాభివృద్ధిలో లింగ సమానత్వం కీలక భూమిక పోషిస్తుంది. సమానత్వం అనేది అభిలషణీయం మాత్రమే కాదు. అది తప్పనిసరి అవసరం కూడా. లింగ సమానత్వం సామాజిక డీఎన్‌ఏలో అంతర్భాగం కావాలి. అప్పుడే చిరకాల స్వప్నమైన మహిళాభ్యుదయం సాకారమవుతుంది.
సమానత్వంతోనే సమ్మిళిత అభివృద్ధి సిద్ధిస్తుంది. కింది అంచె నుంచి పైఅంచె వరకు అందరం సమష్టిగా కృషిచేస్తేనే సమానత్వాన్ని సాధించగలం. నేడు ఇండియాలో ఆర్థికం, వ్యాపారం, డిజిటల్ సాంకేతికతలు, సైన్స్, రక్షణ, విద్య, వైద్యం, క్రీడలు, కళలు, రాజకీయ రంగాల్లో మహిళలు ప్రముఖ స్థానాలను ఆక్రమిస్తున్నారు. అన్ని రంగాల్లో తాము ఉన్నత స్థానాలను అధిరోహించకుండా నిరోధిస్తున్న అదృశ్య తెరలను ఛేదిస్తున్నారు. రక్షణ దళాల్లో పెరిగిన మహిళా భాగస్వామ్యం దీనికి విస్పష్ట ఉదాహరణ. ఇంతకాలం పురుషాధిక్యం నెలకొన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లోనూ మహిళలు వేగంగా విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడల్లోనూ వారు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ గెలిచిన మొత్తం 22 స్వర్ణ పతకాల్లో ఎనిమిది- మహిళా క్రీడాకారులు అందించినవే. నిరుడు మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు తన మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ తొలి విజేతగా భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఇటీవల చరిత్రకెక్కింది. క్రికెట్‌లో ఐపీఎల్ మాదిరిగా విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ప్రారంభించడం లింగ సమానత్వాన్ని మరింత ముందుకుతీసుకుపోతుంది.
అంతర్జాతీయంగా ఖ్యాతి
మహిళలకు సొంత బ్యాంకు ఖాతా, ఆస్తి ఉండటం వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని పటిష్ఠపరుస్తుంది. దానివల్ల వారికి స్వయం నిర్ణయాధికారం దక్కుతుంది. అలా కుటుంబ శ్రేయస్సుకు తోడ్పడే నిర్ణయాలను సైతం వారు తీసుకోగలుగుతారు. దేశంలో సొంత బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న మహిళల సంఖ్య 2015-21 మధ్య కాలంలో 53శాతం నుంచి 78.6శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పరిశీలనలు చెబుతున్నాయి. సొంత ఇల్లు, భూమి (లేదా ఉమ్మడి భూమి) కలిగిన మహిళల సంఖ్య 2015లో 38.4శాతం. 2021 నాటికి వారు 43శాతానికి చేరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన ఖాతాల్లో 66శాతం మహిళా వ్యాపారులు, వ్యవస్థాపకులవే. గ్రామాల్లో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 2018-19లో 19.7శాతం. 2020-21లో అది 27.7శాతానికి పెరిగినట్లు 2022-23 ఆర్థిక సర్వే వెల్లడించింది. మహిళల్లో పని చేయాలనే ఆసక్తి పెరుగుతోందని, మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) ఈ ఆకాంక్షను నెరవేర్చడానికి తోడ్పడగలవని ఆర్థిక సర్వే సూచించింది. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వాటిలో 88శాతాన్ని పూర్తిగా మహిళలే నడుపుతున్నారు. అవి 14.2 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తోడ్పాటును అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా 2022లో పలువురు మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఫ్రాన్స్‌లో 30 ఏళ్ల తరవాత మహిళా ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ పదవీ స్వీకారం చేశారు. దీనా బొలువర్తే పెరూ దేశానికి, షియోమారా కాస్త్రో హోండురాస్ దేశాలకు ప్రథమ మహిళా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలో తొలి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ నియమితురాలయ్యారు. అమెరికా ఆర్థిక శాఖ సారథ్యాన్ని తొలిసారి ఓ మహిళ- జనెట్ ఎలెన్ చేపట్టారు. జార్జియా మెలోనీ ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధాని అయ్యారు. దిగువ స్థాయిలో మాత్రం అన్ని దేశాల్లో లింగ సమానత్వం మరింతగా సాకారం కావాల్సి ఉంది. అన్ని రంగాల్లో స్త్రీ పురుష సమానత్వం సిద్ధించాలంటే ఇంకా 132 ఏళ్లు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది.
వృద్ధ మహిళల ఇక్కట్లు
భారతీయ కుటుంబాల్లో మగ సంతానానికి ప్రాధాన్యమిచ్చే ధోరణి- స్త్రీల పట్ల దుర్విచక్షణకు దారితీస్తోంది. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో మార్పు వస్తున్నా, అది మరింతగా పెరగాలి. దేశీయంగా ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యలో బాలికల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత విద్యలో వారి నమోదు మరింతగా అధికమవడంతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు నాయకత్వ స్థానాలకు చేరాల్సి ఉంది. దేశంలోని విశ్వవిద్యాలయ ఉపకులపతుల్లో మహిళల వాటా తొమ్మిది శాతమే. 2022లో కంపెనీ బోర్డుల్లో మహిళా ప్రాతినిధ్యం 18శాతమే. పనిప్రదేశాల్లో, గృహాల్లో మహిళలు ఇంకా శారీరక, లైంగిక, మానసిక వేధింపులు, ఆర్థిక దురన్యాయానికి గురవుతున్నారు. సంప్రదాయంగా కుటుంబ సభ్యులే వృద్ధుల ఆలనాపాలనా చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు విద్యా ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళడం ఎక్కువైపోయింది. ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమవుతున్నాయి. అందుకే పట్టణాలు, గ్రామాల్లో వృద్ధ మహిళలు ఒంటరిగా బతుకు వెళ్లదీయాల్సి వస్తోంది. జీవిత భాగస్వామి దూరమైన మహిళ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. ఒంటరి వృద్ధ మహిళల కోసం సామాజిక సంరక్షణ సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేవలం ప్రభుత్వ విధానాలతోనే పరిష్కరించలేం. ప్రభుత్వాలతోపాటు సమాజమూ చేయి కలిపి ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. ప్రతి విధానంలో మహిళా కోణం ఉండాలి. లింగ సమానత్వ సాధనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తయ్యేలోగా మహిళాభ్యున్నతి కోసం సమానత్వాన్ని అక్కున చేర్చుకోవాలి.
ఇండియా వెనకంజ
అంతర్జాతీయ లింగపరమైన అంతరాల సూచీ-2022లో 146 దేశాల సరసన భారత్ 135వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం-ఆయుష్షు ఉప సూచీలో మరీ ఘోరంగా అట్టడుగున 146వ స్థానంలో నిలిచింది. మహిళల ఆర్థిక భాగస్వామ్యంలో 143, విద్యాపరమైన విజయాలలో 107, రాజకీయ సాధికారతలో 48వ స్థానాలకే పరిమితమైంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు మనకన్నా ఎంతో మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఇరాన్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లు మాత్రమే భారత్ కన్నా తీసికట్టుగా ఉన్నాయి. దక్షిణాసియా దేశాలన్నింటిలోకీ విద్య, వైద్యాలలో లింగపరమైన సమానత్వం బంగ్లాదేశ్‌లోనే అత్యధికం. రాజకీయ సాధికారత పరంగానూ అక్కడ మహిళలు ముందంజలో ఉన్నారు. భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి పలు పథకాలు చేపట్టింది. పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాల్లో ఒక చోట సాధించిన విజయం మిగతా అంశాల్లోనూ సానుకూల పరిణామాలకు దారితీస్తుంది. ఇంటికి కొళాయి సౌకర్యం ఉంటే బాలికలు నీళ్ల కోసం దూరాభారాలు వెళ్ళాల్సిన అగత్యం తప్పి చదువుకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి జోరు
‣ సముద్ర సహకారంలో చెట్టపట్టాల్!
‣ భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు
‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా
‣ ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23