* ఒక ప్రశ్నకు మాత్రం ఒకటికన్నా ఎక్కువ సమాధానాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని తెలుసుకునేందుకు టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబరు, మొబైల్ నంబరు ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలకు ప్రాథమిక సమాధానాలను పొందుపరిచింది. మాస్టర్ ప్రశ్నపత్రంలోని 17వ ప్రశ్నకు ఒకటికన్నా ఎక్కువ సమాధానాలు సూచించింది. జెనోసైన్ కన్వెన్షన్‌గా పిలిచే జాతి విధ్వంస నేరం నివారణ శిక్ష-1948 పరిధి ఉన్న సంస్థ ఏదనే ప్రశ్నకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) లేదా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)... రెండు సమాధానాలూ సరైనవేనని పేర్కొంది. అభ్యర్థులు మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 17 వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చింది.
ఓఎమ్మార్ డిజిటల్ ప్రతి లేకుండా కీ..
ఓఎమ్మార్ డిజిటల్ ప్రతి లేకుండానే ప్రాథమిక కీ విడుదల చేయడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. గతంలో అభ్యర్థుల ఓఎమ్మార్ (సమాధాన) పత్రాలన్నింటినీ స్కానింగ్ చేసి, అందరి హాజరు వివరాలను సరిచూసుకున్న తర్వాతే ప్రిలిమినరీ కీ ఇచ్చేవారు. వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ప్రాథమిక కీ, ఓఎమ్మార్ పత్రాల డిజిటల్ ప్రతి అందుబాటులో ఉండేవి. వీటితో వారు స్వీయ మూల్యాంకనం చేసుకుని, మాస్టర్ ప్రశ్నపత్రంతో సరిచూసుకుని, తమకు వస్తున్న మార్కులపై అంచనాకు వచ్చేవారు. తర్వాత ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. ఈసారి ఓఎమ్మార్ డిజిటల్ ప్రతి లేకుండానే స్వీయ మూల్యాంకనం చేసుకోవడంపై కొంత ఇబ్బంది పడ్డారు. ప్రశ్నపత్రంలో మల్టిపుల్ జంబ్లింగ్ ప్రశ్నలు, జంబ్లింగ్ సమాధానాలు ఉంటాయని... పరీక్ష రాసేప్పుడు ప్రశ్నపత్రాల్లో సమాధానాలను గుర్తించడమూ నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేస్తున్నారు. ఓఎమ్మార్ డిజిటల్ ప్రతి ఇచ్చి ఉంటే స్వీయ మదింపుపై స్పష్టత వచ్చి ఉండేదని తెలిపారు.
వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఖాళీల వివరాలు
పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టుల ఖాళీల వివరాలను కమిషన్ తన వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం 185 పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువడింది. సర్కారు ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో నంబర్లు 3, 35లను జారీ చేసింది. ఈ మేరకు మహిళా రోస్టర్‌పాయింట్ తొలగిస్తూ సవరించిన ఖాళీల బ్రేకప్ వివరాలను వెల్లడించింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-I స్క్రీనింగ్ టెస్ట్
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.