• facebook
  • whatsapp
  • telegram

SGT posts: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు

* మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్‌లోని నిబంధనపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం  ఫిబ్రవరి 21న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించబోమని తెలిపారు. నోటిఫికేషన్‌లోని సంబంధిత నిబంధనపై స్టే విధించాలని, జీవో 4కు అనుగుణంగా పోస్టుల భర్తీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది.  ఫిబ్రవరి 12న జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ పలువురు డీఈడీ అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Published Date : 22-02-2024 11:17:58

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం