• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS EdCET: టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 

తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టీఎస్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి మే 6 వరకు కొనసాగుతుంది. ఆసక్తికలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష వివరాలు...

* టీఎస్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2024

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.550; ఇతరులకు రూ.750.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 06-05-2024.

ఆలస్య రుసుము రూ.250తో దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 23-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :