• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NEST: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023 

సైన్స్‌, మాథ్స్‌ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్‌ ఒకటి. తాజాగా నెస్ట్‌-2024 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్‌షిప్‌ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్‌ ఇస్తారు.

పరిశోధనల దిశగా ప్రోత్సాహం...

విద్యార్థులకు సైన్స్‌ కోర్సుల్లో ఆసక్తి పెంచి, పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌) ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్‌ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు.. నైసర్‌, సీఈబీఎస్‌ల ప్రత్యేకత. విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ బోధిస్తారు. ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులకు భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుంది. ఇలా ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్‌లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పరీక్ష వివరాలు...

* నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2024

సీట్ల రిజర్వేషన్:

నైసర్‌(200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 0, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.
సీఈబీఎస్‌(57 సీట్లు): జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 6, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.

అర్హత: సైన్స్‌ గ్రూప్‌లతో 2022, 2023లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.

వయసు: వయోపరిమితి లేదు.

ప్రశ్నపత్రం: పరీక్ష రెండు సెషన్‌లలో.. ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు.  

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 20 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: జూన్‌ 15.

పరీక్ష తేదీ: జూన్‌ 30.

ఫలితాల ప్రకటన: జులై 10.

ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :