• facebook
  • whatsapp
  • telegram

కాలేజీ విద్యార్థులకు కెరియర్‌ ట్రైనింగ్‌

టేక్‌ లెసన్స్‌తో ఉద్యోగ సాధన



మైక్రోసాఫ్ట్, ఇంటర్న్‌శాల సంయుక్తంగా ‘టేక్‌ లెసన్స్‌’ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించాయి. దీని ద్వారా ఉద్యోగ సాధనకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని కళాశాల విద్యార్థులకు అందజేస్తారు. పరిశ్రమకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగ సన్నద్ధత, ఎంఎస్‌-ఎక్సెల్‌లో శిక్షణనిస్తారు. 


కొత్త సంవత్సరంలో జనవరి 5 నుంచి 20 వరకూ నిర్దిష్ట అంశాన్ని బట్టి వివిధ తేదీల్లో ఈ శిక్షణ ఆరంభమవుతుంది.   


ఈ సెషన్లలో ఉద్యోగ సాధనకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వడమే కాకుండా విద్యార్థుల సందేహాలకు సమాధానాలూ చెబుతారు. అలాగే కెరియర్‌ ఎంపికలో విద్యార్థులకు అవసరమైన సూచనలందిస్తూ వారికి అన్నివిధాలుగా సాయపడతారు. దీనికి హాజరయ్యే విద్యార్థులకు షార్ట్‌టర్మ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో 10 శాతం రాయితీ సదుపాయం కూడా ఉంటుంది. ప్రారంభ స్థాయిలో ఉండే 80కు పైగా కోర్సులకు ఈ సదుపాయం ఉంటుంది. వీటిల్లో ప్రోగ్రామింగ్, ఇంజినీరింగ్, కెరియర్‌ డెవలప్‌మెంట్, డిజైన్, మీడియా, డేటా సైన్స్, క్రియేటివ్‌ ఆర్ట్స్, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైనవి ఉన్నాయి. 


‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశంలో సాంకేతిక పురోగతి, సరికొత్త ఆవిష్కరణలు.. స్కిల్స్‌ ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడానికే పరిశ్రమలూ మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి వృత్తిని ఎంచుకుంటే విజయం సాధించవచ్చనే విషయంలో యువతకు కొన్ని సందేహాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటివారికి ఈ కార్యక్రమం మార్గ నిర్దేశం చేస్తుంది. సరైన కెరియర్‌ను ఎంచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తాం’ అని తెలిపారు ఇంటర్న్‌శాల శిక్షణాధిపతి షాదబ్‌ ఆలం.


ముఖ్యాంశాలు

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. నిపుణులు, అనుభవజ్ఞులైన ట్యూటర్లు జాబ్‌ ఇంటర్వ్యూ నైపుణ్యాలను బోధిస్తారు. 

ప్రోగ్రామ్‌కు ముందురోజుగానీ లేదా అదేరోజునగానీ కాలేజీ విద్యార్థులు తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

ఈ మార్గదర్శకాలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. 

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇతర ప్రోగ్రామ్‌లను కూడా నేర్చుకోవచ్చు.  


రిజిస్ట్రేషన్‌కు: https://takelessons.com/en-in/ events/classifieds/internshala


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ సీసీఎంబీలో ఉద్యోగావకాశాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-12-2023


 

టెక్‌ స్కిల్స్‌

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం