• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AP EdCET: ఏపీ ఎడ్‌సెట్‌-2024 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 18 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష వివరాలు...

* ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2024 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. 

పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-04-2024.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15-05-2024.

ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2024 నుంచి 19-05-2024 వరకు.

ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ: 20, 21-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22-05-2024 నుంచి 25-05-2024 వరకు.

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 30-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 08-06-2024.

ప్రిలిమినరీ కీ విడుదల: 15-06-2024.

ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 18-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :