• facebook
  • whatsapp
  • telegram

చదివే పద్ధతులివే...

చదవడానికి కొన్ని మంచి పద్ధతులున్నాయి..

 

*  మీరు నేర్చుకోవాలనుకునే మెటీరియల్‌ని మొదట ఆమూలాగ్రం చదివి ఆకళింపు చేసుకోవాలి.

*  చదివిన పాఠంలో ప్రతి పాయింట్‌ను అర్థంచేసుకోవాలి.

*  చదివేటప్పుడే సంక్షిప్తంగా మీకు ఉపయోగపడేలా నోట్స్ తయారుచేసుకోవాలి.

*  రోజు మొత్తంలో మీకు ఏ సమయం అయితే చదువుకోవడానికి వీలుగా ఉంటుందో కచ్చితంగా నిర్థరించుకోవాలి.

*  చాలావరకూ తెల్లవారుజామున చదవడం ఎంతో శ్రేయస్కరం. అయితే కొందరికి మాత్రం సాయంత్రం వేళలో చదివితే బావుంటుంది. సమయాన్ని ఎంపిక చేసుకోవడం మీ అలవాటుకు అనుగుణంగా ఉండాలి.

*  మధ్యాహ్నం పూట మీకంతగా వాతావరణం చదువుకోవడానికి అనువుగా లేదనుకొన్నా, కొంచెం చిరాకుగా ఉన్నా ఓ గంట హాయిగా నిద్రపోండి. మీరు రిలాక్స్ అయ్యాక చదవడం ప్రారంభించండి. మరేం ఫరవాలేదు. అదే పనిగా చదవడమే కాకుండా కొంత రాసే పని కూడా పెట్టుకోండి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి వాటికి జవాబులు రాయడం, మాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం వంటివి చేస్తే మీకు రిలాక్సింగ్‌గా ఉండటమే కాకుండా మీకు సంతృప్తి. మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతాయి.

*  మీ టైమ్‌టేబుల్ షెడ్యూల్‌ని ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోవాలి.

*  సమయాన్ని తెలివిగా విభజిస్తే ముఖ్యమైన విషయాలకు సమయాన్ని కేటాయించడమే కాకుండా మీకు టైమ్ వేస్టయ్యే సమస్య ఉండదు.

*  వీలైనంత వరకు స్టడీస్ కోసమే ఎక్కువ సమయాన్ని వెచ్చించండి.

*  ఒక సబ్జెక్ట్ నుండి మరొక సబ్జెక్టుకు స్థిరత్వం లేకుండా మారిపోతూ సమయం వృథా చేయకండి.

*  ఓ పెద్ద టాపిక్ ఏదైనా తీసుకున్నప్పుడు అది పూర్తయ్యే దాకా దాని మీద శ్రద్ధ చూపించడం మంచిది.

*  ఎక్కువ స్ట్రెస్‌గా ఫీలవుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చినా ఫరవాలేదు. ఇది తిరిగి మీరు ఉత్సాహం పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది.

*  స్టడీస్‌లో ప్రతి గంటకి ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకుంటే చాలు.

*  ప్రతి ఉదయం, ఆరోజు చదవాల్సిన వాటి గురించి కాసేపు నెమరువేసుకోవాలి.

*  రోజు పూర్తి అవగానే ఆరోజు మీరు ఏం చదివారు. తరువాత రోజు చదవాల్సినవి ఏమిటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి.

*  ఈ రోజు అనుకున్న ప్రకారం చదవలేనివి ఏవైనా ఉంటే, వాటికి మరునాడు ప్రాముఖ్యం ఇచ్చితీరాలి.

*  స్కూల్లో క్లాసులు జరిగే ప్రతి రెండు గంటల తరవాత ఓ గంట హోమ్ వర్క్‌కి, ప్రైవేట్ స్టడీకి కేటాయించాలి.

*  కాలేజ్‌లో క్లాసయిన ప్రతి గంట తరవాత ఓ రెండు గంటలు ప్రైవేట్ స్టడీకి కేటాయించాలి. వేళకి భోజనంచేయడం మానకూడదు.

*  చదివే మూడ్ రావాలంటే అందుకు అనువైనవి మీకనుకూలంగా ఏర్పాటు చేసుకోండి. అది చాలా అవసరం.

*  మీరు చదవడానికి వీలైన, సౌకర్యవంతమైన ప్లేస్‌ను ఎంచుకోండి. ఆ ప్లేస్‌లోకి రాగానే మీకు చక్కని మూడ్ రావాలి.

*  చదవటానికి కూర్చోబోయేముందు టైమ్ టేబుల్‌తో పాటు.. టెక్ట్స్ పుస్తకాలు, గైడ్స్, నోట్స్, రిఫరెన్స్ మెటీరియల్, పెన్నులు, పెన్సిల్, స్కేలు, రబ్బరు వగైరా అంతా మీ పక్కనే ఉండాలి.

*  మీరు కూర్చున్న చోటగానీ, ఆ పరిసరాల్లోగానీ ఇతరులు ఎవరూ మాట్లాడుకోవడం చేయకూడదు. వారి ముచ్చట్లు మీ చదువుకి ఆటంకం కలిగిస్తాయి. రేడియో, టి.వి. లాంటివి ఉండకూడదు.

*  చదివేటప్పుడు మీ పుస్తకాలన్నీ చిందరవందరగా లేకుండా నీట్‌గా సర్దిపెట్టుకోండి.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం