• facebook
  • whatsapp
  • telegram

ఏం చదవాలి?.. ఎందుకు చదవాలి?

సురేష్ డిగ్రీ పూర్తిచేసి సివిల్స్ పరీక్షలకు సిద్ధం కావాలనుకుంటున్నాడు. ఆ పరీక్ష విధివిధానాల గురించి తెలుసుకుంటే విస్తృతంగా చదివి, సమాచారాన్ని సేకరించుకోవడం తప్పనిసరి అని తెలిసింది. అతడు డిగ్రీ మంచి మార్కులతోనే పాసైనా, పాఠ్యపుస్తకాలు తప్పితే ఎప్పుడూ ఇతర పుస్తకాలు చదవలేదు. ఆ మాటకొస్తే టెక్ట్స్ పుస్తకాల కంటే ఎక్కువగా టెస్టుపేపర్లు, గైడ్లు ఇలా రేడీమేడ్ సమాధానాలే చదివాడు. వార్తాపత్రికలు, వారపత్రికలు చదివినా ఆ నిమిషం కాలక్షేపానికే తప్ప దానిలోని అంశాలను అర్థం చేసుకోవాలనీ, గుర్తుంచుకోవాలనీ ఎప్పుడూ అనుకోలేదు. సివిల్స్ పరీక్షల్లో పాత పద్ధతులేవీ పనికిరావనీ, రేడీమేడ్ సమాధానాలు, మనకు కావాల్సిన సమాచారమంతా ఒకే పుస్తకంలో లభ్యంకాదనీ తెలిసి సురేష్ కంగారు పడ్డాడు. ఆలోచిస్తే ఇది చాలా పెద్ద అడ్డంకిగా కనిపించింది. దీనివల్ల తన జీవితాశయాన్ని వదులుకోవాల్సిందేనా? అనే నిరుత్సాహం కలిగింది.

      ఇది సురేష్ ఒక్కడి సమస్యాకాదు. కేవలం సివిల్స్ పరీక్షలకు సంబంధించింది మాత్రమే కాదు. ఏ పరీక్షల్లో అయినా ఒక స్థాయిదాటి మార్కులు సంపాదించాలంటే పాఠ్యపుస్తకాలతోబాటు, అనుబంధ పుస్తకాలు సొంతంగా చదివి సమాచారం సేకరించుకోవడం అవసరం. ఉద్యోగాలకోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం పాసు మార్కుల మీద కాకుండా అత్యధిక మార్కులు సంపాదించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ పరీక్షలకు ఇలా సొంతంగా చదువుకోవడం, సొంతంగా నోట్సు తయారు చేసుకోవడం తప్పనిసరి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత విద్యావిధానంలోని లోపాలవల్ల చాలామంది విద్యార్థులకు ఈ నైపుణ్యం పట్టుబడటంలేదు. ఎందుకంటే డిగ్రీ వరకూ ఉండే సాధారణ పరీక్షా విధానంలో దీనికి ప్రాధాన్యత లేదు. కానీ ఈ నైపుణ్యం అత్యవసరం, అనివార్యం అని ఇప్పుడిప్పుడే అనేకులు గ్రహిస్తున్నారు.
 

వివిధ పనులు చేయడం ద్వారా మనం పొందగలిగే విజ్ఞానాన్ని ఇలా అంచనా వేయవచ్చు.

ఎందుకు చదవాలి?

'పరీక్షలు చదువు అంటూ ఒకటే టెన్షన్ పెట్టేస్తున్నారు. అసలు ఎందుకు చదవాలి? చదవాల్సిన అవసరం ఏముంది?' అని కొంతమంది ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. చదువు కేవలం పరీక్షలు రాసి పాసవడానికే కాదు. చదువులో జీవిత పరమార్థం ఉంది.

1. చదువువల్ల విజ్ఞానం పెరుగుతుంది.

2. మానసిక పరిపక్వత కలుగుతుంది. ఆలోచన పరిధి పెరుగుతుంది.

3. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడంవల్ల మంచి కోర్సుల్లో చేరగలుగుతారు.

4. ఈ పోటీ ప్రపంచంలో ప్రతిభాపాటవాలతో నెగ్గుకురాగల శక్తి సామర్థ్యాలు మీకుంటాయి.

5. చదువు ఆర్థిక భద్రతను చేకూరు

ఏమి చదువుతున్నామో తెలియాలి

      ఎందుకు చదువుతున్నామో తెలిసిన తర్వాత ఏమి చదువుతున్నామో తెలియాలి. అంటే మనం చదవబోయే అంశం స్వభావమూ, పరిధీ తెలుసుకోవాలి. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం లాంటి సాంకేతిక అంశమా? చరిత్ర, రాజనీతి శాస్త్రం లాంటి మానవశాస్త్రమా? ఇలాంటి వివరాలు స్వభావాన్ని సూచిస్తాయి. మనం చదవబోయే సమాచారంలోని శీర్షికలూ, ఉపశీర్షికలూ ఒకసారి చదివితే మనకూ ఈ స్వభావం, పరిధీ కొంతవరకూ అర్థమవుతాయి.

       ఇలా చదువుతున్నప్పుడే ఈ శీర్షికలనూ, ఉపశీర్షికలనూ ప్రశ్నలుగా మార్చుకోవాలి. చదివిన సమాచారాన్ని పేరాగ్రాఫులవారీగా తిరిగి మన సొంతమాటల్లో చెప్పేందుకు ప్రయత్నించాలి. మరీ పెద్ద పేరాలు ఉన్నప్పుడు మూడు నాలుగు వాక్యాలకొకసారి ఇలా తిరిగి చెప్పడం (అనుకోవడం) చేయాలి. ఇలా చేయడం మొదట్లో కష్టంగా ఉంటుంది. చదువు ముందుకు సాగదు. ఒక పేజీ చదవడానికి గంటలు పట్టేస్తాయి. కానీ యాభై నుంచి వంద పేజీలు ఇలా చదవగలిగితే, చదివిన విషయాన్ని సొంతమాటల్లోకి అనువదించుకోవడం మీకు అలవాటైపోతుంది. ఆ తర్వాత ఇదో సహజ ప్రక్రియగా మారుతుంది.

      పూర్తిగా కొత్త విషయాలు, కఠినమైన సాంకేతిక విషయాలు చదువుతున్నప్పుడు ఇలా మూడు నాలుగు వాక్యాలకొకసారి సొంతవాక్యాల్లోకి మార్చుకున్న అంశాన్ని సొంతమాటల్లోనే ఒక పక్కన రాసుకోవాలి. కొత్త పేరాలోకో, కొత్త సబ్‌హెడింగ్‌లోకో వెళ్లేముందు ఈ సారాంశాన్నంతా ఒకసారి చదువుకోవాలి. మనకొక స్పష్టమైన రూపం ఏర్పడిందన్న నమ్మకం కుదిరాకే తర్వాత విషయం చదవాలి.

      మొత్తంగా చెప్పాలంటే చదవడం, చదివి అర్థం చేసుకోవడం అనేది విద్యాభ్యాసానికి సంబంధించిన ఒక ప్రాథమికమైన పని. ఈ పనిని సమర్థవంతంగా చేయడంలో (అ) లక్ష్య నిర్ధారణ: ఎందుకు చదువుతున్నాం? (ఆ) స్వభావమూ, పరిధి తెలుసుకోవడం అనేవి రెండూ మనను మానసికంగా చదివేందుకు సిద్ధం చేస్తాయి. (అ) ప్రశ్నలు వేసుకోవడం (ఆ) సొంతమాటల్లో సారాంశాన్ని చెప్పుకోవడం అనే రెండూ ఆచరణాత్మకమైన పనులు. వీటిని చేస్తూ ఉన్నకొద్దీ ఆ పనిని సులువుగా, వేగంగా చేయడం వస్తుంది.

      చదవడం, చదివి అర్థం చేసుకోవడం అనేది విద్యాభ్యాసానికి సంబంధించిన ఒక ప్రాథమికమైన పని. ఈ పనిని సమర్థవంతంగా చేయడంలో (అ) లక్ష్య నిర్ధారణ: ఎందుకు చదువుతున్నాం? (ఆ) స్వభావమూ, పరిధి తెలుసుకోవడం అనేవి రెండూ మనను మానసికంగా చదివేందుకు సిద్ధం చేస్తాయి. (అ) ప్రశ్నలు వేసుకోవడం (ఆ) సొంతమాటల్లో సారాంశాన్ని చెప్పుకోవడం అనే రెండూ ఆచరణాత్మకమైన పనులు. వీటిని చేసేకొద్దీ ఆ పనిని సులువుగా, వేగంగా చేయడం వస్తుంది.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం