• facebook
  • whatsapp
  • telegram

నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

ఏ దేశ విదేశీ వాణిజ్యం మెరుగుపడాలన్నా ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా కొనసాగాలి. అలా లేనప్పుడు దేశాల మధ్య వాణిజ్యం మందకొడిగా ఉంటుంది. అంతర్జాతీయంగా గడచిన రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌ తన విదేశీ వాణిజ్యాన్ని కొంతవరకు మెరుగు పరచుకోగలిగింది. అయితే, ఎగుమతులను మరింత పెంచుకోవడం ద్వారా వాణిజ్య లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరముంది.

కొంతకాలంగా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో విదేశీ వాణిజ్యం ఒడుదొడుకులకు లోనవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని అనుకుంటున్న సమయంలోనే కొవిడ్‌-19 విజృంభించడం, పలు దేశాల మధ్య పోరాటాలు తలెత్తడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటివి చోటుచేసుకున్నాయి. వాటి ప్రభావం 2023లో భారత ఎగుమతులపై పడింది. అయితే, గడచిన రెండు మూడు నెలలుగా దేశం నుంచి ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుందంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తదితర సంస్థలు మాత్రం 2024లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాలు కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా అవి విశ్లేషిస్తున్నాయి.

అవకాశాల కోసం అన్వేషణ

వివిధ దేశాల నడుమ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఎగుమతి దేశాలు కొత్త అవకాశాల కోసం అన్వేషించాల్సి ఉంటుంది. భారత్‌ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఆస్ట్రేలియా, యూఏఈలతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల మేరకు ఎగుమతులను పెంచుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ఎగుమతిదారులకు విధానపరమైన సహకారాన్ని అందించాలి. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లను సాధించాలనే లక్ష్యంతో కేంద్రం ‘విదేశీ వాణిజ్య విధానం-2023’ రూపొందించింది. ఈ-కామర్స్‌, జిల్లాల నుంచి ఎగుమతులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. దీనితోపాటు 14 రంగాల కోసం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) దేశీయ ఎగుమతులను రాబోయే రోజుల్లో మరింత ఇనుమడింపజేస్తుంది. ఇప్పటికే ఈ పథకం ఎలెక్ట్రానిక్స్‌ రంగంలో అనూహ్య ప్రగతికి దోహదపడింది. భారత్‌ బలమైన ఎగుమతి దేశంగా అవతరించాలంటే, మరిన్ని నూతన విధానాలను రూపొందించుకోవాలి.

గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతానికి మాత్రమే పరిమితమైంది. 2022 ఏప్రిల్‌- నవంబరు మధ్య 29,821 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. వాటితో పోలిస్తే గత ఏడాది అదే కాలంలో ఎగుమతులు 6.3శాతం (27,879 కోట్ల డాలర్లు) తక్కువగా నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం- పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతినడమే. భారత్‌ అతిపెద్ద ముడిచమురు దిగుమతి దేశం మాత్రమే కాదు, పెద్దయెత్తున పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశం కూడా. వీటితో పాటు కార్మికులకు అధికంగా ఉపాధి కల్పించే ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, రసాయనాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా తగ్గాయి. 2022 నవంబరుతో పోలిస్తే గత ఏడాది అదే నెలలో జరిగిన ఎగుమతుల్లో 2.83 శాతం (3,390 కోట్ల డాలర్ల) తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల 15 కీలక రంగాల్లో నమోదైంది. సంతోషించాల్సిన విషయమేమిటంటే- అదే నెలలో దిగుమతులు 8.67 శాతం (44,514 కోట్ల డాలర్ల) మేర తగ్గడం; సేవా రంగం ఎగుమతులు 5.93 శాతం పెరగడం! దాంతో వాణిజ్య లోటు 6144 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇది 2022 నవంబరులో నమోదైన 10,038 కోట్ల డాలర్ల వాణిజ్యలోటు కన్నా 38.79 శాతం తక్కువ! ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా తక్కువ వాణిజ్య లోటు ఒక మంచి పరిణామం అవుతుంది. ఎందుకంటే చెల్లింపుల (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)పై అది పెద్ద ప్రభావం చూపదు. ఎర్రసముద్రంలో కొంతకాలంగా వాణిజ్య నౌకా రవాణా సంక్షోభంవల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏ క్షణమైనా పెరగవచ్చని భావిస్తున్నారు. కాబట్టి, ద్రవ్యలోటును అదుపులో ఉంచాలంటే, ఎగుమతులను మరింతగా పెంచుకోవాలి. ముఖ్యంగా సేవా రంగంలో కీలకమైన ఐటీ సేవల ఎగుమతులను పెంచుకోవడంపై దృష్టి సారించాలి.

ఆశలు చిగురించాలంటే..

అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్‌ దూరదృష్టితో వ్యవహరించాలి. ముఖ్యంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల ప్రక్రియను జోరెత్తించడంపై దృష్టి సారించాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందే యూకే, ఒమన్‌, పెరూ, శ్రీలంక, ఐరోపా సమాఖ్య దేశాలతో ఒప్పందాలను పూర్తిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎగుమతిచేసే వస్తువుల తయారీ కోసం చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి ముడిపదార్థాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడం ఇండియాకు అత్యావశ్యకం. ఆయా దేశాల నుంచి అవి తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి దాన్ని తప్పుగా భావించకూడదు. పైగా దేశంపై దిగుమతుల భారం తగ్గుతుంది. ఇటువంటి విడిభాగాలతో తయారయ్యే ఉత్పత్తులు ప్రజలకు, పరిశ్రమలకు చౌక ధరలకే లభిస్తాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం కొంతవరకు అదుపులో ఉంటుంది. అలాగని ముడిపదార్థాలు, విడిభాగాల కోసం ఎల్లకాలం విదేశాలపైనే ఆధారపడటం సరికాదు. వాటిని దీర్ఘకాలంలో దేశీయంగానే తక్కువ ధరకు తయారు చేసుకోవాలి. లేదంటే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలి. ఈ ప్రయోగం మన సెల్‌ఫోన్ల ఉత్పత్తి, వందే భారత్‌ రైళ్ల తయారీలో విజయవంతమైంది. సేవా రంగం ఎగుమతుల్లో ఐటీ ఉత్పత్తుల వల్ల దేశానికి మంచి పేరు వచ్చింది. ఎలెక్ట్రానిక్స్‌, ఇనుము, మాంసం, డైరీ ఉత్పత్తులు, కాఫీ, పొగాకు వంటి విభాగాల్లోనూ ఎగుమతులను జోరెత్తించాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని  ఎప్పటికప్పుడు సమీక్షించాలి. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని మరిన్ని దేశాలకు విస్తరించుకోవడం ఇండియాకు ఎంతో అవసరం. తద్వారా వాణిజ్య లావాదేవీల ఖర్చును తగ్గించుకోవచ్చు.

చైనా కోలుకునేదెప్పుడో!

చైనా ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా దిగజారుతుండటం ప్రపంచ వాణిజ్యానికి శరాఘాతంగా మారింది. భారత్‌ సహా అనేక దేశాల్లోని పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు, విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచే వస్తాయి. వీటి సరఫరా కుంచించుకుపోవడంతో భారత్‌ తదితర దేశాల తయారీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. ముఖ్యంగా ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అన్ని దేశాలు ఆర్థికంగా బాగుండాలంటే చైనా త్వరగా కోలుకోవడం తప్పనిసరి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను చూస్తుంటే డ్రాగన్‌ ఎప్పటికి కోలుకుంటుందో తెలియడంలేదు. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక సూచీలు చాలా ప్రతికూలంగా ఉంటున్నాయి.
 
-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

‣ ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు

‣ కాగ్‌ విశ్వసనీయతకు తూట్లు

‣ మాల్దీవులతో బంధానికి బీటలు

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక రంగం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం