‣ జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసుల పోస్టుల కోసం 1 : 3 నిష్పత్తి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌గార్డెన్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిరోజూ ఉదయం, మధాహ్నం వేళల్లో పరిశీలన జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో గైర్హాజరైన వారు, ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇవ్వనివారు.. వాటిని సమర్పించేందుకు ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వుడేగా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అలాగే గ్రూప్-2 దరఖాస్తుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు జూన్ 20 తో ముగియనుందని తెలిపింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు
‣ మీ ప్రాథమిక వివరాలు నింపిన చెక్‌లిస్ట్
‣ మీ దరఖాస్తు ఫారం (2 కాపీలు)
‣ పరీక్ష హాల్‌టికెట్
‣ పుట్టిన తేదీ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ మెమో)
‣ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం
‣ మీ విద్యార్హతలకు సంబంధించిన ప్రొవిజినల్, కాన్వొకేషన్ సర్టిఫికెట్, మార్కుల మెమో (గ్రాడ్యుయేషన్/పీజీ)
‣ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (తండ్రి లేదా తల్లి పేరుతో మాత్రమే ఉండాలి)
‣ బీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ (ఓబీసీ సర్టిఫికెట్లను అనుమతించరు)
‣ వివాహిత మహిళలకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లు భర్త పేరుతో ఉంటే అనుమతి లేదు.
‣ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 2021-22 ఏడాదితో ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి.
‣ వయో సడలింపు పొందేందుకు మీరు సమర్పించిన వివరాలకు అవసరమైన ఆధారాలతో ధ్రువీకరణపత్రాలు
‣ దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం సర్టిఫికెట్)
‣ ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులైతే.. సంబంధిత సంస్థ నుంచి ఎన్వోసీ తీసుకోవాలి.
‣ గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న రెండు అటిస్టేషన్ కాపీలు
‣ నిరుద్యోగి అని పేర్కొనే డిక్లరేషన్
‣ ఈ నోటిఫికేషన్లో కొన్ని ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక అర్హతలకు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లు ఉండాలి. పోస్ట్ కోడ్ 70కి అప్లై చేసిన అభ్యర్థులు తాము హిందువు అని తెలిపే డిక్లరేషన్ తీసుకెళ్లాలి.
‣ పోస్ట్‌కోడ్ 94, 95కు సంబంధించిన ఉద్యోగాలకైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ర్యాంక్‌కు తక్కువ కాని అధికారి నుంచి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తయారు చేయించాలి.
‣ ఇటీవల తీసుకున్న మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు సిద్ధం చేసుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.