• facebook
  • whatsapp
  • telegram

EAPCET Seat Allotment: ఈఏపీసెట్‌ తొలి దశ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

* సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు తేదీ జులై 23
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను కేటాయించారు. దాదాపు 96 వేల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో 72,741 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో సైన్-ఇన్ ద్వారా అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు జులై 19-23లోపు చేరాల్సి ఉంటుంది. రెండో దశ ప్రవేశాల ప్రక్రియ జులై 26న ప్రారంభం కానుంది.
 

    ఈఏపీసెట్‌ సీట్‌ అలాట్‌మెంట్ ఆర్డర్‌ కోసం క్లిక్‌ చేయండి   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.