• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APRMJC: ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2024 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు:

* ఏపీ రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు

కళాశాలల వివరాలు:

1. ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), గుంటూరు.

2. ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), కర్నూలు.

3. ఏపీఆర్‌ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలికలు), వాయల్పాడు.

గ్రూపుల వారీగా సీట్లు: ఎంపీసీ- 120, బైపీసీ- 120, సీఈసీ- 105.

మొత్తం సీట్ల సంఖ్య: 345.

అర్హత: 2023-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: మైనార్టీ విద్యార్థులకు పదో తరగతి మార్కుల ఆధారంగా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు…

మొదటి జాబితా దరఖాస్తులు ప్రారంభం: 01.05.2024

మొదటి జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 20.05.2024.

మొదటి జాబితా ఫలితాల వెల్లడి: 21.05.2024.

రెండో జాబితా దరఖాస్తులు ప్రారంభం: 22.05.2024.

రెండో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 30.05.2024.

రెండో జాబితా ఫలితాల వెల్లడి: 31.05.2024.

మూడో జాబితా దరఖాస్తులు ప్రారంభం: 01.06.2024.

మూడో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 10.06.2024.

మూడో జాబితా ఫలితాల వెల్లడి: 11.06.2024.

ప్రవేశాల ముగింపు తేదీ: 18.06.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :