• facebook
  • whatsapp
  • telegram

అధ్యయన అలవాట్లు

పునశ్చరణను క్రమబద్ధం చేసేవి మీ అధ్యయన అలవాట్లు.

చదవడానికి కూర్చునే ముందు సానుకూల దృక్పథం కలిగి ఉండండి. ఇప్పుడు చదవక తప్పదా అనే నిరాశను వదిలిపెట్టండి.

అసౌకర్యాన్ని, అంతరాయాన్ని కలిగించే పరిస్థితులు మీ చదువు సమయంలో తలెత్తకుండా చూసుకోండి.

మీ అభిరుచిని బట్టి కాకుండా అవసరాన్ని బట్టి మీరు చదివే సబ్జెక్టులను ఎంపిక చేసుకోండి. అంటే పరీక్షలు జరుగుతున్న క్రమంలోనే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఏకాగ్రత కుదరని సమయాల్లో మీరు ఇష్టపడే సబ్జెక్టులను కొద్దిసేపు చదివినా సరిపోతుంది.

శీర్షికలు, గ్రాఫ్‌లు, ప్రశ్నలు వంటివాటిని తరచుగా పరిశీలించండి. దీనివల్ల సబ్జెక్టులో చర్చించిన అంశాలపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

పాఠంలోని కీలకపదాలను, సాంకేతిక పదాలను గుర్తించండి.

ఒకసారి పాఠాన్ని సమగ్రంగా చదవడం పూర్తి చేసిన తరువాత పాఠ్య పుస్తకాలు, నోట్సు ఒకపక్కన పెట్టండి.

మీరు చదివిన సబ్జెక్టులో మీకు అర్థమైన అంశాల సారాంశాన్ని ఏకాంతంగా గానీ, స్నేహితులతో కలిసి గానీ ఆకళింపు చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి ప్రయత్నించండి.

మీరు చదివిన అంశాలకు సంబంధించిన ఇతర రిఫరెన్స్ పుస్తకాలను చదవడానికి ప్రయత్నించండి. అంతర్జాలంలో వెతకండి. ట్యూటర్‌తో చర్చించండి. దీనిద్వారా ఆయా అంశాలపై మీకు సాధికారికత వస్తుంది.

ఇదే అంశంపై సాధికారికత కలిగిన ప్రొఫెసర్లతో మాట్లాడటానికి ప్రయత్నించండి.

మీకు ఇప్పటి వరకూ అర్థమైన సంగతులేమిటో ఒకసారి మననం చేసుకోండి.

మీకు మీరుగా పరీక్ష విధించుకోండి. ఇప్పటివరకూ ఈ అంశంపై పాత ప్రశ్నాపత్రాలలో ఎటువంటి ప్రశ్నలు అడిగారు? ఇంకా ఏ తరహా ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది? నేను చదివిన దాంట్లో లోపాలేమైనా ఉన్నాయా? అని పరీక్షించుకోండి.

వివిధ ప్రశ్నలను నేను చదివిన అంశాలను ఎలా మేళవించాలి? మరేదైనా పద్ధతులు ఉన్నాయా అని పరిశీలించండి.

మీకు తెలిసిన అంశాలను మీ స్నేహితులతో చర్చించండి.

ఇటీవల జరిగిన పరీక్షలో మీకు వచ్చిన గ్రేడ్‌ల ఆధారంగా మీ స్థాయి ఏమిటో నిర్థరించుకోండి. మరింత అభివృద్ధిని సాధించేందుకు ఏం చేయాలో ఆలోచించండి. లక్ష్యాన్ని సుదూరంగా ఉంచుకోకండి.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం