• facebook
  • whatsapp
  • telegram

పురోగామి రాష్ట్రాలకు నష్టం

పునర్విభజనతో న్యాయం జరిగేనా?

పార్లమెంటు ఆమోదం తెలిపిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలులోకి రావాలంటే ముందుగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆయా రాష్ట్రాల్లో జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపు ఉంటుంది. కానీ, కొవిడ్‌ కారణంగా 2021నాటి జనగణన వాయిదా పడింది. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరింత సమయం పడుతుంది.

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 81, 82వ రాజ్యాంగ అధికరణలు విధివిధానాలను నిర్వచించాయి. జనగణన పూర్తయిన ప్రతిసారీ లోక్‌సభలో రాష్ట్రాలకు కేటాయించిన సీట్లను, ప్రతి రాష్ట్ర శాసనసభలో ప్రాదేశిక నియోజకవర్గాలను సర్దుబాటు చేయాలని 82వ అధికరణ నిర్దేశిస్తోంది. ఇందుకు అనుసరించాల్సిన పద్ధతిని 1962నాటి పునర్విభజన కమిషన్‌ చట్టంలో పొందుపరచారు. లోక్‌సభ, శాసనసభ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల ప్రాదేశిక హద్దులను జనాభా రీత్యా ఎప్పటికప్పుడు తిరిగి నిర్ణయించడాన్ని పునర్విభజన (డీలిమిటేషన్‌) అంటారు. దీని ప్రకారమే లోక్‌సభ, శాసనసభల్లో సీట్ల సంఖ్యను నిర్దేశిస్తారు. 60లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 31వ రాజ్యాంగ సవరణ నిర్దేశిస్తోంది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. ఆ సమాచారాన్ని క్రోడీకరించడానికి రెండేళ్లు పడుతుంది. ఆ తరవాతే పునర్విభజన కమిషన్‌ను నియమిస్తారు. అది నియోజకవర్గాల పునర్విభజనను పూర్తిచేయడానికి మరో రెండేళ్లు పడుతుంది. ఆ లెక్కన 2026లో తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగి, 2029 ఎన్నికల నుంచి అమలులోకి రావాల్సి ఉంటుంది. దేశంలో 2021 జనగణన వాయిదా పడినందువల్ల ఇదంతా అనుకున్నట్టే జరుగుతుందని చెప్పలేం!

2026లో మరోసారి

దేశంలో ఇప్పటివరకు 1952, 1963, 1973, 2002లో మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఏడో రాజ్యాంగ సవరణ లోక్‌సభ సీట్లను 520కి పరిమితం చేయగా, 31వ రాజ్యాంగ సవరణతో 552కు పెంచారు. అయితే, లోక్‌సభలో ఇప్పుడు మొత్తం 543 సీట్లు ఉన్నాయి. 2002లో తెచ్చిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం- నియోజకవర్గాల పునర్విభజనను తిరిగి 2026లో మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. 1973 వరకు భారతదేశం సీట్ల కేటాయింపునకు దామాషా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించింది. జాతీయ జనాభా విధానాన్ని పాటించి సమర్థంగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం చేస్తోందని గ్రహించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం... 1973లో పునర్విభజన ప్రక్రియను నిలిపేసింది. హిందీ రాష్ట్రాలు జనాభా నియంత్రణను సక్రమంగా అమలుచేయని మాట నిజం. 2020లో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు జాతీయ సగటును 19.5గా లెక్కగట్టారు. గరిష్ఠంగా అది బిహార్‌లో 25.5గా నమోదైంది. ఆ తదుపరి స్థానాలను ఉత్తర్‌ప్రదేశ్‌ (25.1), మధ్యప్రదేశ్‌ (24.1), రాజస్థాన్‌ (23.5), అస్సాం (20.8), తెలంగాణ (16.4), ఆంధ్రప్రదేశ్‌ (15.7), పశ్చిమ్‌బెంగాల్‌ (14.6), పంజాబ్‌ (14.3), తమిళనాడు (13.8), కేరళ (13.2) ఆక్రమించాయి. జనాభా నియంత్రణ, సమర్థ పాలన విధానాలను చేపడుతున్న రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన శిక్షగా, అధిక జనాభాగల రాష్ట్రాలకు వరంగా నిలవనున్నది. జననాల రేటును బట్టి చూస్తే నియోజకవర్గాల పునర్విభజనలో అత్యధికంగా లోక్‌సభ సీట్లను కోల్పోయే రాష్ట్రాలు: తమిళనాడు(8), కేరళ(8), ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ(8), పశ్చిమ్‌బెంగాల్‌(4), ఒడిశా(3), కర్ణాటక(2). హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లు తలా ఒక సీటును కోల్పోతాయి. మరోవైపు- ఉత్తర్‌ప్రదేశ్‌(11), బిహార్‌(11), రాజస్థాన్‌(6), మధ్యప్రదేశ్‌(4)లతో పాటు ఝార్ఖండ్‌, హరియాణా, గుజరాత్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లు తలా ఒక లోక్‌సభ సీటును అదనంగా పొందుతాయి. ఏతావతా కొత్త పునర్విభజనతో అవినీతి, అసమర్థ పాలన, జనాభా నియంత్రణలో వైఫల్యం వంటి అవలక్షణాలు రాజ్యమేలే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. కొంత మెరుగైన పాలన, జనాభా నియంత్రణను పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దక్షిణాదిలో ఎస్సీ, ఎస్టీ కులాలకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాదిన పెరుగుతుంది. కేవలం జనాభా ఆధారంగానే లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచాలనడం సరికాదు. 2011 జనగణన లేదా సమీప భవిష్యత్తులో చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే లోక్‌సభలో సీట్ల సంఖ్య ఏకంగా 697కు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (143), బిహార్‌ (79), మహారాష్ట్ర (76), పశ్చిమ్‌బెంగాల్‌(60), మధ్యప్రదేశ్‌ (52), రాజస్థాన్‌ (50), ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ (54), తమిళనాడు (49)ల్లో మొత్తం సీట్లు ఇప్పటికంటే ఎక్కువగా ఉంటాయి.

వాయిదా పడుతుందా?

రాష్టాల జనాభాకు, సీట్ల సంఖ్యకు మధ్య నిష్పత్తి సాధ్యమైనంతవరకు ఆచరణాత్మక పద్ధతిలో ఉండేలా చూడాలని 82వ రాజ్యాంగ సవరణ సూచిస్తోంది. అన్ని రాష్ట్రాలకూ న్యాయం జరిగేలా నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి, అవసరమైతే పునర్విభజనను తాత్కాలికంగా నిలిపివేయడానికి అవకాశముంది. కానీ, దాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. పదేళ్లుగా దక్షిణ భారతంలో బలం పెంచుకోవడానికి భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆ పార్టీ బలమంతా ఉత్తరాదిన హిందీ రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి, జనాభాపరంగా ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరిగితే అది భాజపాకు లాభిస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో ఈ రాష్ట్రాలకే ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది కాబట్టి, తమకు అనుకూలమైన విధానాలను చేపట్టే పరిస్థితి ఉంటుంది. నిధులు సైతం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకే లభిస్తాయి. కాబట్టి, నియోజకవర్గాల పునర్విభజనను కొంతకాలం వాయిదా వేయడమే మేలు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది- వచ్చే సార్వత్రిక ఎన్నికల తరవాత అధికారం చేపట్టే రాజకీయ పక్షమే!

రిజర్వుడు సీట్లను దృష్టిలో ఉంచుకుని..

పునర్విభజన కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. వారిలో ఇద్దరు సుప్రీంకోర్టు, హైకోర్టు సిటింగ్‌ లేదా విశ్రాంత న్యాయమూర్తులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఒక సభ్యుడిని నామినేట్‌ చేస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమితులవుతారు. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ప్రతి రాష్ట్రంలోని పునర్విభజన కమిషన్‌ తొమ్మిది మంది అసోసియేట్‌ సభ్యులను నియమిస్తుంది. వారిలో నలుగురు లోక్‌సభ స్పీకర్‌ నామినేట్‌ చేసిన ఆ సభ సభ్యులు ఉంటారు. మిగతా అయిదుగురు అసోసియేట్‌ సభ్యులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్‌ చేస్తారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంలోని 81వ అధికరణ (లోక్‌సభ కూర్పు), 170వ అధికరణ (శాసనససభల కూర్పు), 330వ అధికరణ (లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌), 332వ అధికరణ(శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌) ప్రకారం జరగాలి. రిజర్వుడు సీట్లను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది.
 
-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చిరకాల మైత్రికి సరికొత్త సవాళ్లు

‣ ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనం

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

‣ అగ్రరాజ్యం.. కొత్త వ్యూహం!

‣ చట్ట సభల్లో గట్టి స్వరం

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

Posted Date: 06-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం