• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCET: ఎన్‌టీఏ- నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌సీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు పొందవచ్చు. పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సు సీట్లను భర్తీ చేస్తాయి.

కోర్సు వివరాలు:

* నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2024

కోర్సులు: బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ.

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు/ ఆర్‌ఐఈ/ ఎన్‌ఐటీలు/ ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి. 

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.

తెలుగు రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 02, 03, 04-05-2024.

పరీక్ష కేంద్రం వివరాల వెల్లడి: మే చివరి వారం.

పరీక్ష తేది: 12-06-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :