• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NEET-PG: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2024

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) 2024 పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష వివరాలు:

* నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2024

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.

పరీక్ష రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500.

పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మా«ధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, భీమవరం, ఆదిలాబాద్, అమలాపురం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, ఎమ్మిగనూరు, వరంగల్, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళం, సూర్యాపేట, తడపాలిగూడెం, రాజంపేట, తాడిపత్రి, రాజమండ్రి, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, నిజామాబాద్, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, నల్గొండ, కొత్తగూడెం, కర్నూలు, మచిలీపట్నం, మహబూబ్ నగర్, మార్కాపురం, ఖమ్మం, కావలి, కరీంనగర్, కాకినాడ, కడప.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06-05-2024.

పరీక్ష తేదీ: 23-06-2024.

ఫలితాల వెల్లడి: 15-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :