• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APRS CAT: ఏపీఆర్‌ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 12 ఏపీఆర్‌ఎస్‌ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్‌ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్‌ఎస్‌(మైనార్టీ) గురుకుల పాఠశాలలు​ ఏర్పాటయ్యాయి. అర్హులైన మైనార్టీ, పీహెచ్‌సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన బాలబాలికలు మే 31 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు...

ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 (ఏపీఆర్‌ఎస్‌- మైనార్టీ క్యా్ట్‌ 2024)

తరగతులు: 5, 6, 7, 8.

12 గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 920.

12 గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 1073.

అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.

వయసు: అయిదో తరగతికి 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య; ఆరో తరగతికి 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య; ఏడో తరగతికి 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య; ఎనిమిదో తరగతికి 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :