• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS ICET: తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (టీఎస్‌ఐసెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు జూన్‌ 4, 5 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు:

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (టీఎస్‌ ఐసెట్‌)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, ఏప్రిల్‌ 30తో ముగుస్తుంది. రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

పరీక్షల నిర్వహణ: జూన్‌ 4, 5 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!


 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :