• facebook
  • whatsapp
  • telegram

దిక్కులు

దిక్కు తోచకపోతే మార్కు పోయినట్టే!

 

  లాజికల్‌ రీజనింగ్‌లో అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాలను పరీక్షిస్తారు. అందులో భాగంగా దిక్కులు టాపిక్‌ నుంచి అడిగే ప్రశ్నలు పైకి తేలిగ్గా కనిపించిన తప్పకుండా తికమక పెడతాయి. సరైన దిక్కును పట్టుకోకపోతే సమాధానం తట్టదు. మార్కు పోతుంది. కాస్త దృష్టిపెట్టి ప్రాక్టీస్‌ చేస్తే పూర్తి మార్కులు సులభంగా సాధించుకోవచ్చు.

 

పైథాగరస్‌ సిద్ధాంతం: 

 

లాజికల్‌ త్రిభుజాలు

 రెండు భుజాలు 3, 4 గా ఉన్నప్పుడు పైథాగరస్‌ సిద్ధాంతం ప్రకారం కర్ణం 5 వస్తుంది. అలాగే రెండు భుజాలు 6, 8 గా ఉంటే కర్ణం 10; 5, 12 గా ఉంటే కర్ణం 13 వస్తుంది.

1. ఒక వ్యక్తి తూర్పు వైపునకు 10 మీ. ప్రయాణించి కుడివైపునకు తిరిగి 10 కి.మీ. తర్వాత ఎడమవైపు తిరిగి వరుసగా 5 మీ., 15 మీ., 15 మీ. ప్రయాణించాడు. అయితే అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?

1) 10 మీ.       2) 5 మీ.   3) 20 మీ.   4) 25 మీ.

జవాబు: 2

సాధన: దత్తాంశం ప్రకారం పటం గీయాలి

 

2. ఒక వ్యక్తి ఇంటి నుంచి 3 కి.మీ. ఉత్తరం వైపునకు ప్రయాణించి కుడివైపు తిరిగి వరుసగా 2 కి.మీ., 5 కి.మీ., 2 కి.మీ., 2 కి.మీ. ప్రయాణించాడు. అయితే అతడు బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కులో ఉన్నాడు? 

1) దక్షిణం       2) ఉత్తరం       3) ఈశాన్యం      4) ప్రారంభ స్థానం 

జవాబు: 4

సాధన: దత్తాంశం ప్రకారం పటం గీయాలి

 

3. ఒక వ్యక్తి ఆఫీసు నుంచి కారులో ఉత్తరం వైపునకు 15 కి.మీ. ప్రయాణించిన తర్వాత ఎడమ వైపు తిరిగి వరుసగా 10 కి.మీ., 5 కి.మీ., 8 కి.మీ. ప్రయాణించి కుడి వైపునకు తిరిగి 10 కి.మీ. ప్రయాణించాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఏ దిక్కున ఉన్నాడు? 

1) 2 కి.మీ., పడమర        2) 5 కి.మీ., తూర్పు         3) 3 కి.మీ., ఉత్తరం       4) 6 కి.మీ., దక్షిణం 

జవాబు: 1

సాధన: దత్తాంశం ప్రకారం పటం గీయాలి

 

4. ఒక వ్యక్తి సైకిల్‌పై 7 కి.మీ. తూర్పు వైపునకు ప్రయాణించి కుడివైపు తిరిగి వరుసగా 3 కి.మీ., 10 కి.మీ. ప్రయాణించాడు. అయితే ఆయన బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కులో ఉన్నాడు? 

1) నైరుతి      2) వాయవ్యం      3) ఈశాన్యం      4) ఆగ్నేయం 

జవాబు: 1

సాధన: ఇచ్చిన దత్తాంశం ప్రకారం పటం గీయాలి

 

 

5. ఒక వ్యక్తి A నుంచి 3 కి.మీ. తూర్పు వైపునకు ప్రయాణించి B కి చేరాడు. అక్కడి నుంచి ఎడమ వైపునకు 9 కి.మీ. ప్రయాణించి C కి చేరాడు. మళ్లీ ఎడమ వైపునకు AB కి 5 రెట్లు దూరం ప్రయాణించి D కి చేరాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి అతడు ఎంత దూరంలో ఉన్నాడు? 

1) 12 కి.మీ.    2) 15 కి.మీ.   3) 16 కి.మీ.   4) 18 కి.మీ.

జవాబు: 2

సాధన: ఇచ్చిన దత్తాంశం ప్రకారం పటం గీయాలి

ADల మధ్య దూరం కావాలి. 

 AEని BCకి సమాంతరంగా గీశాం. కాబట్టి AEల మధ్య దూరం 9 కి.మీ. అవుతుంది. DEల మధ్య దూరం 12 కి.మీ. అవుతుంది. ఫైథాగరస్‌ సిద్ధాంతం ప్రకారం

వ్యతిరేక దిక్కులను తీసివేసినప్పుడు రెండు దిక్కుల కంటే ఎక్కువ ఉంటే ఫైథాగరస్‌ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. అప్పుడు అవుతుంది.

 

6. అక్షర 10 కి.మీ. ఉత్తరం వైపు ప్రయాణించి అక్కడి నుంచి దక్షిణం వైపునకు 6 కి.మీ., ఎడమ వైపునకు తిరిగి 3 కి.మీ. ప్రయాణించింది. అయితే ఆమె బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిక్కున ఉంది? 

1) 5 కి.మీ., పడమర        2) 5 కి.మీ., ఈశాన్యం 

3) 7 కి.మీ., తూర్పు           4) 7 కి.మీ., పడమర 

జవాబు: 2

సాధన: ఇచ్చిన దత్తాంశం ప్రకారం ముందుగా బయలుదేరిన స్థానం నుంచి వరుసగా A, B, C, D బిందువులతో పటం గీసుకోవాలి.

ADల మధ్య దూరం కావాలి. లాజికల్‌ త్రిభుజాల ప్రకారం భుజాలు 3, 4 గా ఉన్నప్పుడు కర్ణం 5 వస్తుంది. 

అక్షర బయలుదేరిన స్థానం నుంచి 5 కి.మీ. దూరంలో ఈశాన్యం దిక్కున ఉంది.

 

7. అనిల్‌ ఆగ్నేయం దిశలో 7 మీ., పడమర వైపునకు 14 మీ. ప్రయాణించి అక్కడి నుంచి 7 మీ. వాయవ్యం దిక్కులో, 4 మీ. తూర్పు వైపునకు ప్రయాణించాడు. అయితే అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? 

1) 3 మీ.       2) 4 మీ.       3) 10 మీ.     4) 11 మీ. 

జవాబు: 3

సాధన: ఇచ్చిన దత్తాంశం ప్రకారం బొమ్మ గీయాలి. వాటిని వరుసగా A, B, C, D, ని గా గుర్తించాలి.

    AEల మధ్య దూరం కావాలి. తిదీ అనేది తీది కి సమాంతరంగా ఉంది కాబట్టి ADల మధ్య దూరం 14 మీ. అవుతుంది. 

వ్యతిరేక దిక్కులను తీసివేసినప్పుడు  మిగులుతుంది. 

 

8. గడియారంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిమిషాల ముల్లు ఈశాన్యం దిక్కులో ఉంటే సమయం 1 : 30 అయినప్పుడు గంటల ముల్లు ఏ దిక్కులో ఉంది? 

1) ఉత్తరం      2) దక్షిణం      3) తూర్పు      4) పడమర 

జవాబు: 3

సాధన:

 

అభ్యాస ప్రశ్నలు

 

1. కైలాష్‌ 3 కి.మీ. తూర్పునకు ప్రయాణించి దక్షిణం వైపునకు తిరిగి 4 కి.మీ., పడమర వైపు తిరిగి 6 కి.మీ. ప్రయాణించాడు. అయితే బయలుదేరిన స్థానానికి అతడు ఎంత దూరంలో ఉన్నాడు? 

1) 7 కి.మీ.       2) 5 కి.మీ.       3) 6 కి.మీ.       4) 3 కి.మీ. 

 

2. ప్రతాప్‌ స్కూల్‌ నుంచి 7 కి.మీ. తూర్పునకు ప్రయాణించి ఎడమ వైపునకు తిరిగి 4 కి.మీ., కుడి వైపునకు తిరిగి వరుసగా 2 కి.మీ., 3 కి.మీ. ప్రయాణించాడు. అయితే ప్రతాప్‌ చివరిగా ఏ దిక్కుకు ప్రయాణించాడు?

1) దక్షిణం       2) ఉత్తరం       3) తూర్పు       4) పడమర

 

3. గడియారంలో 3 గంటల సమయం అయినప్పుడు నిమిషాల ముల్లు ఈశాన్యంలో ఉంటే గంటల ముల్లు ఏ దిక్కులో ఉంటుంది?

1) దక్షిణం       2) నైరుతి       3) వాయవ్యం       4) ఆగ్నేయం 

 

4. ఒక వ్యక్తి ఉత్తరం వైపునకు 20 మీ. ప్రయాణించి కుడి వైపునకు వరుసగా 30 మీ., 35 మీ.; ఎడమ వైపునకు తిరిగి వరుసగా 15 మీ., 15 మీ. ప్రయాణించాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి అతడు ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు? 

1) 15 మీ., పడమర       2) 30 మీ., తూర్పు 

3) 30 మీ., పడమర       4) 45 మీ., తూర్పు

 

5. హరి 75 మీటర్లు ఉత్తరం వైపు ప్రయాణించి ఎడమ వైపునకు వరుసగా 25 మీ., 80 మీ. ప్రయాణించి కుడివైపు 45ా తిరిగాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి అతడు ఏ దిక్కులో ప్రయాణిస్తున్నాడు? 

1) ఈశాన్యం      2) వాయవ్యం     3) ఆగ్నేయం     4) నైరుతి

 

సమాధానాలు: 1-2     2-1     3-4     4-4     5-4.

 

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 దిశ నిర్దేశ పరీక్ష

 సీటింగ్ అరేంజ్‌మెంట్‌

 మిస్సింగ్ నంబర్స్

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌