• facebook
  • whatsapp
  • telegram

అవకాశాలు.. 'సముద్ర'మంత!

భూ ప‌రిణామ క్రమంలో 150 కోట్ల సంవ‌త్సరాల‌కు పూర్వం సముద్రాలు ఉద్భవించాయి. నాలుగింట మూడొంతులు భూభాగం నీటితో (సముద్రాలు) కప్పి ఉంది. సముద్రాల్లో పర్వతాలు, లోయలు, చెట్లుతో పాటు అపార ఖనిజ సంపద ఉంది. వాతావరణంలో మార్పులకు సముద్రాలే కారణం. దేశాభివృద్ధిలోనూ సముద్రాల పాత్ర ఎంతో కీలకం. సముద్ర తీరం లక్షలాది మందికి జీవనాధారం. జీవం పుట్టుక నుంచి ఇప్పటి దాకా ప్రతిదశలోనూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతున్న సముద్రాల ఉనికిని గురించి, భౌతిక, రసాయనిక మార్పుల గురించి, సాగర జీవులు, ఖ‌నిజ‌సంప‌ద‌ గురించి అధ్యయ‌న‌మే... ఓషనోగ్రఫీ.

కోర్సు స్వభావం:

అబివృద్ధి చెందిన దేశాల్లో ఈ కోర్సుకు ఇప్పటికే విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం మ‌న దేశంలోనూ ఈ కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. స‌ముద్రమంత‌టి విశాల‌మైన ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తోంది ఈ కోర్సు. స‌ముద్రాల గురించి స‌మ‌గ్ర అధ్యయ‌న‌మే ఓష‌నోగ్రఫీ. ఇదో కొత్త త‌ర‌హా సైన్స్‌. ఈ కోర్సుకు చేసిన వారికి ఇటు ప్రభుత్వ రంగంతో పాటు ప‌రిశోధ‌న రంగంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఉపాధి అవ‌కాశాలు క‌ల్సిస్తున్నాయి. నిత్యం నేర్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌ ఉన్నవారికి ఈ కోర్సు అవ‌కాశం క‌ల్పిస్తుంది.

కోర్సులు

ఫిజికల్ ఓషనోగ్రఫీ

జియోలాజికల్ ఓషనోగ్రఫీ

కెమికల్ ఓషనోగ్రఫీ

మెరైన్ బయాలజీ

అర్హతలు

ఓషనోగ్రఫీకి సంబంధించి దేశంలోని కొన్ని యూనివర్శిటీలు బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ డిగ్రీలను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన వారు బ్యాచిలర్ డిగ్రీ, తర్వాత మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం సీఎస్ఐఆర్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీ పూర్తి చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ-గోవా వంటి సంస్థలు పీహెచ్‌డీకి అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు

ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. సైంటిస్టుగా, ఇంజనీర్‌గా, టెక్నీషియన్‌గా రాణించొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మెట్రోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎంఎస్ఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మెరైన్ ఇండస్ట్రీస్, రీసెర్చ్‌కు సంబంధించిన పలు ప్రైవేట్ కంపెనీలూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. నైపుణ్యం, సామర్థ్యం ఉన్న అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తినీ ఎంచుకోవచ్చు. ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ కళాశాలలు, యూనివర్శిటీల్లో టీచింగ్ ప్రొఫెషన్‌లో కొనసాగొచ్చు.

విభాగాలు

మెరైన్ బయాలజీ

ఫిజికల్ ఓషనోగ్రఫీ

జియోలాజికల్ ఓషనోగ్రఫీ

మెరైన్ ఆర్కియాలిజిస్ట్

కోస్టల్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్

మెరైన్ కెమిస్ట్రీ

మెరైన్ పాలసీ ఎక్స్‌పర్ట్

మెడికల్ రీసెర్చ్

అడ్మినిస్ట్రేష‌న్‌

విధులు

సముద్రం గురించి సమగ్ర అధ్యయనమే ఓషనోగ్రఫీ. సముద్రంలో నమూనాలు సేకరించడం, సర్వేలు నిర్వహించడం, వచ్చిన డేటాను అధునాతన పరికరాలతో విశ్లేషించడం ఓషనోగ్రఫర్ల ముఖ్య విధులు. సముద్ర జలాల్లో జరిగే భౌతిక రసాయన మార్పులు, తీర ప్రాంతాలపై వాటి ప్రభావం, వాతవరణం, శీతోష్ణస్థితిలో మార్పులు అంచనా వేయాలి. నిరంతరం పరిశోధనలతో కూడిన ఈ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ కాలం సముద్రజలాల్లో గడపాల్సి ఉంటుంది. సవాళ్లు, ప్రమాదాలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎంచుకున్న స్పెషలైజేషన్లపై ఆధారపడి ఉంటుంది.

వేతనాలు

ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రారంభంలో రూ.12000- రూ.20,000 వరకూ వేతనం లభిస్తుంది. అనంతరం అభ్యర్థి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ఉపాధి అవకాశాలు అందించే సంస్థలపై వేతనాలు ఆధారపడి ఉంటాయి.

కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు/ విద్యా సంస్థలు

1. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.

http://www.andhrauniversity.info

2. అన్నా యూనివర్సిటీ, చెన్నై.

http://www.annauniv.edu/

3. అన్నామ‌ళై యూనివర్సిటీ, త‌మిళ‌నాడు.

http://www.casmbenvis.nic.in

4. బాబా సాహెబ్ అంబేద్కర్ మ‌రాట్వాడా యూనివర్సిటీ, ర‌త్నగిరి, మ‌హారాష్ట్ర.

https://www.bamu.net/index.html

5. భార‌తీ ద‌స‌న్ యూనివర్సిటీ, తిరుచునాప‌ల్లి, త‌మిళ‌నాడు.

http://www.bdu.ac.in

6. బ‌రంపూర్ యూనివర్సిటీ, బ‌రంపురం, ఒడిశా.

http://www.bamu.nic.in/

7. క‌ల‌క‌త్తా యూనివర్సిటీ, కోల్‌క‌తా, ప‌శ్చిమ బెంగాల్‌.

http://www.caluniv.ac.in

8. సెంట్ర ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిష‌రీస్ ఎడ్యుకేష‌న్‌, ముంబ‌యి, మ‌హారాష్ట్ర.

http://www.cife.edu.in/

9. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, కోచీ, కేర‌ళ‌.

http://www.cusat.ac.in

10. గోవా యూనివ‌ర్శిటీ, గోవా.

http://www.unigoa.ac.in

11. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, న్యూఢిల్లీ.

http://www.iitd.ac.in

12. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఖ‌రగ్‌పూర్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌.

http://www.iitkgp.ac.in

13 ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్‌, చెన్నై, త‌మిళ‌నాడు.

http://www.iitm.ac.in/

14. ఇన్లాండ్ ఫిష‌రీస్ యూనిట్‌, బెంగ‌ళూరు, క‌ర్నాట‌క‌.

http://www.kvafsu.co.in/

15. క‌ర్నాట‌క యూనివర్సిటీ, క‌ర్నాట‌క‌.

http://www.kud.ac.in/

16. కేర‌ళ అగ్రిక‌ల్చర్ యూనివర్సిటీ, ఎర్నాకుళం, కేరళ.

http://www.kau.edu/

17. మంగ‌ళూరు యూనివర్సిటీ, మంగ‌ళ‌గంగోత్రి, క‌ర్నాట‌క‌.

www.mangaloreuniversity.ac.in/

18. త‌మిళ‌నాడు వెట‌ర్నరీ అండ్ యానిమ‌ల్ సైన్స్ యూనివర్సిటీ, ట్యూటికోరిన్‌, త‌మిళ‌నాడు

http://www.tanuvas.tn.nic.in/index.html

19. యూనివర్సిటీ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ సైన్సెస్‌, మంగ‌ళూరు, క‌ర్నాట‌క‌

http://www.uasbangalore.edu.in/

20.యూనివర్సిటీ ఆఫ్ కేర‌ళ‌, త్రివేండ్రం, కేర‌ళ‌

http://www.keralauniversity.ac.in/

Posted Date: 08-09-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌