• facebook
  • whatsapp
  • telegram

పోషకాల కళ.. కలినరీ ఆర్ట్స్!

బీబీఏ, ఎంబీఏలో ప్రవేశాలకు ప్రకటన విడుదల

విద్యార్హత: ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ

ఆరోగ్యానికి, మన శక్తిసామర్థ్యాలకు మూలం ఆహారం. దీనికి కాస్త గార్నిష్ జోడైతే నోటికి మరింత రుచి, మనసుకు ఆనందం. ఇటీవల కాలంలో స్టార్ హోటళ్లలో ఆహారాన్ని చూడగానే నోరూరేలా.. మరికొంచెం తినాలనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వండిన పదార్థాలపై అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్నే కలినరీ ఆర్ట్స్ అంటారు. పెద్దపెద్ద హోటళ్లలో కలినరీ ఆర్ట్స్లో ప్రావీణ్యం కలిగినవారు అధిక వేతనాలు పొందుతున్నారు. కలినరీ ఆర్ట్స్ అంటే కేవలం ఆహారంపై అలంకరణ మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలలో అత్యధికపోషకాలు ఉండేటట్లు చూడటం.

కలినరీ ఆర్ట్స్ నేర్పించేందుకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ప్రాంగణాలున్నాయి. రెండింటిలో కలిసి బీబీఏలో 240 సీట్లు, ఎంబీఏలో 60 సీట్లు ఉన్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఆయా కోర్సులు అందిస్తారు. 

కోర్సుల వివరాలు..

బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ)

కోర్సు వ్యవధి మూడేళ్లు(6 సెమిస్టర్లు) ఉంటుంది. ప్రవేశ రుసుము, ట్యూషన్, పరీక్ష తదితర ఫీజులు కలిపి ఏడాది సుమారు రూ.1.5 లక్షలు చెల్లించాలి. వసతి, భోజనం ఖర్చులు అదనం.

అర్హత: ఇందులో చేరాలంటే కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ రెండో సంవ్సరం చదువున్న విద్యార్థులూ అర్హులే. వయసు జులై 15, 2021 నాటికి ఎస్సీ/ఎస్టీలకు 27 ఏళ్లు, ఇతరులకు 22 ఏళ్లు మించకూడదు. 

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)

ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు(4 సెమిస్టర్లు). ప్రవేశ రుసుము, ట్యూషన్, పరీక్ష తదితర కలిపి ఏడాదికి రూ. 1.5 లక్షలు చెల్లించాలి. వసతి, భోజనం ఖర్చులు అదనం. 

అర్హత: కనీసం 50శాతం మార్కులతో కలినరీ ఆర్ట్స్/ హాస్పిటాలిటీ/ హోటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు జులై 15, 2021 నాటికి ఎస్సీ/ఎస్టీలకు 30 ఏళ్లు, ఇతరులకు 25 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ఇలా..

బీబీఏ: ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

ఎంబీఏ: ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫుడ్ ప్రొడక్షన్/ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్/ మేనేజ్మెంట్, అనలిటికల్ ఆప్టిట్యూడ్/ ఐక్యూ, హ్యూమన్ రిసోర్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మెరిట్తో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలో పరీక్షను నిర్వహిస్తారు.

దరఖాస్తు చేయండిలా...

అర్హులైన అభ్యర్థులు ఆయా కోర్సులకు ఆన్లైన్/ ఈమెయిల్/ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు తుది గడువు జులై 15, 2021. 

ఉద్యోగావకాశాలు

ఆయా కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. టూరిజం రంగంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చెఫ్లతో పాటు హాస్పిటాలిటీ విభాగాల్లో మంచి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్వేస్, రైల్వేస్‌లో కేటరింగ్, ఇండియన్ నేవీలో కిచెన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు, సొంతంగా బిజినెస్ కూడా చేయవచ్చు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు అందిస్తాయి. కలినరీ ఆర్ట్స్‌లో టీచింగ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ హోటళ్లలో చెఫ్, న్యూట్రిషనిస్ట్, కిచెన్ మేనేజర్, హాస్పిటాలిటీ సర్వీసెస్ తదిరత విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.

వెబ్‌సైట్‌: http://thims.gov.in/
 

Posted Date: 06-06-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌