• facebook
  • whatsapp
  • telegram

లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్

అనేక విష‌యాల‌ను నిక్షిప్తం చేసుకొని అవ‌స‌రమైన స‌మ‌యాల్లో వెల్లడి చేస్తుంది మ‌న మెద‌డు. కానీ కాల‌గ‌మ‌నంలో జ్ఞాప‌కాల పొర‌లు పెరిగిపోయి కొన్ని వెంట‌నే గుర్తుకురావు. మ‌రికొన్నింటిని జ్ఞప్తికి తెచ్చుకోలేం. అన్నింటిని అనుకున్నంత స్పష్టంగా అంద‌రికీ ఒకేసారి చెప్పలేం. ఈ ప‌రిస్థితుల్లోనే మ‌నిషి పుస్తక ర‌చ‌న‌ను ప్రారంభించిన‌ట్లున్నాడు. ప్రాచీన కాలంలో తాళ‌ప‌త్రాల్లోనూ, త‌ర్వాత కాలంలో కాగితాల్లోనూ, ప్రస్తుత ఆధునిక యుగంలో డిజిట‌ల్ రూపంలోనూ విజ్ఞాన విశేషాల‌ను, అభిప్రాయాల‌ను, సంఘ‌ట‌న‌ల‌ను, ప‌రిశోధ‌న‌ల‌ను అక్షర‌బ‌ద్ధం చేసి పొందుప‌రుస్తున్నాడు. వీటిని భ‌విష్యత్తు త‌రాల‌కు అందిస్తున్నాడు. ఇలా ఎంద‌రో రాసిన గ్రంథాల‌ను భ‌ద్రప‌రిచి ప‌ది కాలాల పాటు వినియోగించుకోవ‌డం కూడా అంత తేలికైన విష‌యం కాదు. ఇందుకోసం గ్రంథాల‌యాలను (లైబ్రరీలు) ఏర్పాటు చేశారు.  క్రీ.పూ. 600 సంవ‌త్సరాల క్రిత‌మే మెస‌ప‌టోమియా నాగ‌రిక‌త‌లో గ్రంథాల‌యాల ప్రస్తావ‌న ఉంది. ఇక్కడి గ్రంథాల‌యాల్లో చ‌దునైన‌ రాతి ప‌ల‌క‌ల‌ను పుస్తకాలుగా వాడేవారు. ఈజిప్టు నాగ‌రిక‌త‌లో దేవాల‌యాల‌నే విజ్ఞానాన్ని పంచే గ్రంథాల‌యాలుగా ఉప‌యోగించేవారు.

రోమ‌న్లు 4వ‌ శతాబ్దంలో 28 ప్రజా గ్రంథాల‌యాల‌ను స్థాపించారు. ఇంగ్లండ్‌లో 19 శ‌తాబ్దంలో గ్రంథాల‌యాల స్థాప‌న జ‌రిగింది. నేటి మ‌న ఆధునిక గ్రంథాల‌యాల‌కు వీటినే మూల స్తంభాలుగా చెప్పవ‌చ్చు.

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు. విజ్ఞానాన్ని పంచే మాధ్యమాలుగా పనిచేస్తున్నాయి. అందువల్ల సమాజంలో వీటి ప్రాధాన్యం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో గ్రంథాలయ నిర్వహణ అనేది కీలకంగా మారింది. వీటిని నిర్వహించేవారు గ్రంథాలయాలకు కావాల్సిన పుస్తకాలను సమకూర్చుకోవడం, వాటి బాగోగులు చూడటం లాంటివి క్రమం తప్పకుండా చేయాలి. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో లైబ్రేరియన్లు ప్రధాన‌ పాత్ర పోషిస్తారు. అందువల్ల వీరికి వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మంచి గుర్తింపు ఉంటుంది.    విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల స్థాపన గణనీయంగా పెరగడం వల్ల ఈ కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. సమాచార, విద్యావ్యవస్థకు సంబంధించి ''లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్'' విభాగాలు ప్రస్తుతం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

సమాచార పరిజ్ఞానం, విద్య, రాజకీయాలు, ఆర్థిక సమాచారం, గ్రంథాలయాలకు సంబంధించిన సమాచార సేకరణ, సమాచార సంరక్షణ, సమాచార వనరులవ్యాప్తి అనేవి ఇందులోని ప్రధానాంశాలు. లైబ్రరీ సైన్స్ విభాగంలో పురాతత్వ శాస్త్రం (Archival Science) కూడా ఉంటుంది. దీనివల్ల పురాతన నాగరికతలు, సమాజం గురించి తెలుసుకోవచ్చు.ఇన్ని ప్రత్యేకతలున్న లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం...

   సంప్రదాయ గ్రంథాలయాల్లో కేవలం పుస్తకాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రంథాలయాల్లో పీరియాడికల్స్‌, జర్నల్స్‌, మైక్రోఫిల్మ్‌లు, ఆడియో - వీడియో సీడీలు, పాఠశాల - కళాశాల విద్యకు సంబంధించిన లఘుచిత్రాలు, పరిశోధనలు ఇలాంటివెన్నో మనకు లభిస్తున్నాయి. కనుమరుగవుతున్న భాషలు, సాహిత్యం, కళలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

ఉదా: తాళపత్ర గ్రంథాలు, వేదాలను కంప్యూటరీకరించడం.

   వృత్తిగా 'లైబ్రరీ సైన్స్' ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గ్రంథాలయాలు అందించే సేవలు, సమాచార వనరులకు ఉన్న చట్టబద్ధత, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి డాక్యుమెంట్లను, మేనేజ్‌మెంట్ రికార్డులను తయారుచేయడం లాంటివి గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నాయి. 1887లో 'మెల్విల్‌డివే' అనే లైబ్రేరియన్ కొలంబియా యూనివర్సిటీలో మొదటిసారిగా 'లైబ్రరీసైన్స్' విభాగాన్ని ప్రారంభించాడు. త‌ర్వాత కాలంలో ప్రపంచ‌వ్యాప్తంగా ప‌లు యూనివ‌ర్సిటీలు, సంస్థలు దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ర‌క‌ర‌కాల కోర్సుల‌ను ప్రారంభించారు.

అందుబాటులో ఉన్న కోర్సులు:

   'లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్' విభాగంలో వివిధ‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి: 

* ఇంట‌ర్మీడియ‌ట్ అర్హత‌తో స‌ర్టిఫికేట్ కోర్సులు (C.LI.Sc / C.LIB), డిప్లొమా కోర్సులు (D.LI.Sc / D.LIB) చేయ‌వ‌చ్చు. 

ఏదైనా విభాగంలో డిగ్రీ చ‌దివిన వారు ఏడాది వ్యవ‌ధి ఉండే బ్యాచీల‌ర్ కోర్సు (B.L.I.Sc) చేయ‌వ‌చ్చు.

'లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్' విభాగంలో బ్యాచీల‌ర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఏడాది వ్యవ‌ధి ఉండే పీజీ కోర్సు (M.L.I.Sc) చేయ‌వ‌చ్చు

పీజీ కోర్పు పూర్తిచేసినవారు 'లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌'లో ఎంఫిల్ (M.Phil), పీహెచ్‌డీ (Ph.D) కూడా చేసే అవకాశం ఉంది.

ఉపాధి మార్గంలో...

   'లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ ఉత్తమ ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తిగా ఎదుగుతోంది. భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పుస్తకాలన్నీ సీడీల రూపంలో లభిస్తున్నాయి. 'అంతర్జాలం(ఇంటర్నెట్) రాకతో ప్రపంచ గమనం మారిపోయింది. దీంతో ఎలక్ట్రానిక్ గ్రంథాలయాలు (e-libraries) వెలిశాయి. ఇవి అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు వీటిపట్ల ఆసక్తి చూపుతున్నారు.

వివిధ రంగాల్లో అవకాశాలు:

*¤ ప్రభుత్వ లైబ్రరీలు

*¤ విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు/ పాఠశాలలు/ ఇతర విద్యాసంస్థలు

వార్తా సంస్థలు

* ప్రైవేటు సంస్థలు/ ప్రత్యేక లైబ్రరీలు

విదేశీ కార్యాలయాలు

¤ఫొటో/ ఫిల్మ్/ రేడియో/ టెలివిజన్ లైబ్రరీలు

¤సమాచార కేంద్రాలు/ డాక్యుమెంటేషన్ కేంద్రాలు

¤కంపెనీలు/ సంస్థల్లో పెద్దమొత్తంలో సమాచారాన్ని హాండిల్ చేయడానికి అవసరమైన మానవ వనరులు

¤మ్యూజియంలు, గ్యాలరీలు

¤న్యాయశాస్త్ర గ్రంథాలయాలు

విభిన్న ర‌కాల ఉద్యోగాలు:

ఈ వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రైవేటు ముద్రణా సంస్థల్లో, ఇతర కంపెనీల్లో ఎక్కువ మొత్తంలో ఉన్న సమాచారాన్ని సేకరించడం లాంటి ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది.

1) లైబ్రేరియన్/ చీఫ్ లైబ్రేరియన్ (Librarian/ Chief Librarian)

2) లైబ్రరీ అటెండెంట్ (Library attendant)

3) లైబ్రరీ అసిస్టెంట్ (Library Assistant)

4) సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ (Semi - Professional Assistant)

5) జూనియర్ లైబ్రేరియన్/ ప్రొఫెషనల్ అసిస్టెంట్ (Junior Librarian/ Professional Assistant)    

6) అసిస్టెంట్ లైబ్రేరియన్ (Assistant Librarian)

7) డిప్యూటీ లైబ్రేరియన్ (Deputy Librarian)

8) ఆర్కైవిస్ట్ (Archivist)

9) ఇన్‌ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ (Information architect)

10) ఇన్‌డెక్సర్ (Indexer)

11) రీసెర్చర్/ సైంటిస్ట్/ అప్లికేషన్ స్పెషలిస్ట్ (Researcher/ Scientist/ Application Specialist)

12) కన్సల్టెంట్/ రిఫరెన్స్ లైబ్రేరియన్ (Consultant/ Reference Librarian)

13) క్యాటలాగర్/ టెక్నికల్ అసిస్టెంట్/ రికార్డ్ మేనేజర్ (Cataloguer/ Technical Assistant/ Record Manager)

14) డైరెక్టర్/ హెడ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ Director/ Head of Information Centre)

15) సీనియర్ ఇన్‌ఫర్మేషన్ అనలిస్ట్ (Senior Information Analyst)

16) జూనియర్ ఇన్‌ఫర్మేషన్ అనలిస్ట్ (Junior Information Analyst)

17) సీనియర్ లైబ్రేరి ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్ (Senior Library Information Assistant)

18) లా లైబ్రేరియన్(Law Librarian)

జీతభత్యాలు:

* సమాచార విప్లవం నేపథ్యంలో లైబ్రేరియన్‌గా పనిచేసేవారు మంచి వేతనాలు పొందుతున్నారు. ఉద్యోగి జీతభ‌త్యాలు సంబంధిత సంస్థపై ఆధారప‌డి ఉంటాయి. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా జీతాన్ని నిర్ణయిస్తారు.

* ఈ వృత్తిలో మంచి విద్యార్హత, నైపుణ్యం ఉన్నవారు తక్కువకాలంలో ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. స్పెషల్ లైబ్రేరియన్‌గా పనిచేసేవారికి జీతం ఎక్కువగా ఉంటుంది.

* చాలా క‌ళాశాల‌లు, యూనివ‌ర్సిటీలు యూజీసీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లైబ్రరీ ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తున్నాయి.

* డీఆర్‌డీఓ, ఇస్రో, సీఎస్ఐర్‌, ఐసీఏఆర్ లాంటి కేంద్ర ప్రభుత్వ ప‌రిశోధ‌న సంస్థలు సైంటిఫిక్ ఉద్యోగుల‌తో స‌మానంగా లైబ్రరీ ఉద్యోగుల‌కు వేత‌నాలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో లైబ్రరీ ఉద్యోగుల‌కు రూ .9300 - 34,800 వేత‌నంగా ఇస్తున్నారు.

విధులు...

*¤ లైబ్రరీ - ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, బైబిలోగ్రఫి, డాక్యుమెంటేషన్, లిఖిత పూర్వక ప్రతులను పరిరక్షించడం, సమాచారవ్యవస్థ పరిజ్ఞానం, పరిశోధనా విధానం, కంప్యూటర్ అప్లికేషన్లు, గణాంకాల నిర్వహణ, పాత రికార్డుల సమాచార నిర్వహణ, గ్రంథాలయ ప్రణాళిక లాంటివి ఈ వృత్తిపరమైన విధుల్లో ముఖ్యమైనవి.

*¤ డేటాబేస్, నాలెజ్డ్ మేనేజ్‌మెంట్ లాంటి సరికొత్త మార్పులతో లైబ్రరీసైన్స్ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అందుబాటులో ఉన్న వనరుల నుంచి సమాచారం సంపాదించుకోవడం అనేది ఆసక్తిని పెంచే అంశం.

*¤ వినియోగదారుల అవసరాలను అధ్యయనం చేసి వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడం.

*¤ ఇంటర్నెట్, ఇతర సమాచార వనరుల నుంచి సమాచారాన్ని ప్రభావవంతంగా సేకరించాలి.

*¤ సమాచార వనరులను వినియోగించుకొని కంప్యూటర్ రికార్డులను తయారుచేసే వారికి తగిన సూచనలు ఇవ్వడం.

*¤ పుస్తకాలు, కరపత్రాలు, లిఖిత‌పూర్వక పత్రాలు, ఇతర అరుదైన పుస్తకాలను సేకరించి పర్యవేక్షించడం.

*¤ చిన్న పిల్లల్లో కథల ద్వారా విద్యా నైపుణ్యాలను పెంచడం, పెద్దవారికి అవసరమైన పుస్తకాలను పరిచయం చేయడం లాంటివి విధిగా భావించాలి.

*¤ అవసరాలకు అనుగుణంగా జూనియర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం.

అవ‌స‌ర‌మైన‌ నైపుణ్యాలేమిటి ..?

*¤ మంచి లైబ్రేరియన్‌గా రాణించాలనుకునేవారికి పుస్తకాలకు సంబంధించిన విషయాల్లో, వర్తమాన వ్యవహారాలపైనా మంచి పట్టుండాలి.

*¤ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సేవాదృక్పథం, నిర్వహణ సామర్థ్యం, ఇతరుల అవసరాలను గుర్తించడం లాంటి లక్షణాలు అవసరం.

లైబ్రరీ సైన్స్ కోర్సును అందిస్తున్న కొన్ని ముఖ్య విద్యాసంస్థలు:

*¤ ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR).

వెబ్‌సైట్‌: www.niscair.res.in

*¤ బెంగళూరులోని డాక్యుమెంటేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (DRTC) సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

వెబ్‌సైట్‌: http://drtc.isibang.ac.in/DRTC

ఇవేకాక దేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. అవి:

1) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ.

వెబ్‌సైట్‌: www.du.ac.in

2) అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్.

వెబ్‌సైట్‌: www.amu.ac.in  

3) బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి.

వెబ్‌సైట్‌: www.bhu.ac.in

4) జామీయా మిల్లియా ఇస్లామియా, ఢిల్లీ.

వెబ్‌సైట్‌: http://jmi.ac.in  

5) మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్, వారణాసి.

వెబ్‌సైట్‌: www.mgkvp.ac.in

6) పి.టి. రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ, రాయపూర్, ఛత్తీస్‌గడ్.

వెబ్‌సైట్‌: www.prsu.ac.in  

7) సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి.

వెబ్‌సైట్‌: www.ssvv.ac.in

8) కురుక్షేత్ర యూనివర్సిటీ, హర్యానా.

వెబ్‌సైట్‌: www.kuk.ac.in

9) పంజాబ్ యూనివర్సిటీ

వెబ్‌సైట్‌: http://puchd.ac.in

10) గుజరాత్ యూనివర్సిటీ

వెబ్‌సైట్‌: www.gujaratuniversity.org.in

11) మధురై కామరాజ్ యూనివర్సిటీ, తమిళనాడు.

వెబ్‌సైట్‌: www.mkuniversity.org

12) అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు.

వెబ్‌సైట్‌: http://annamalaiuniversity.ac.in

13) మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం, భోపాల్.

వెబ్‌సైట్‌: www.mcu.ac.in/Departments.aspx

14) అమరావతి యూనివర్సిటీ, మహారాష్ట్ర.

వెబ్‌సైట్‌: http://sgbau.ac.in

15) ఆర్యవిద్యాపీఠ్ కన్య మహావిద్యాలయ, భరత్‌పూర్, రాజస్థాన్.

వెబ్‌సైట్‌: http://www.rajhry.com/index.aspx

16) యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, భరత్‌పూర్, రాజస్థాన్.

వెబ్‌సైట్‌: www.uniraj.ac.in

17) అవదేశ్‌ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ, రేవా, మధ్యప్రదేశ్.

వెబ్‌సైట్‌: http://apsurewa.ac.in/index.aspx

18) బెంగళూరు యూనివర్సిటీ, బెంగళూరు.

వెబ్‌సైట్‌: www.bangaloreuniversity.ac.in/Default.aspx

19) బెహాని శిక్షామహావిద్యాలయ, అజ్మీర్ రాజస్థాన్.

20) భావ్‌నగర్ యూనివర్సిటీ, భావ్‌నగర్, గుజరాత్.

వెబ్‌సైట్‌: http://www.mkbhavuni.edu.in/library-science-dept.php

21) బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, రాంచీ, జార్ఖండ్.

వెబ్‌సైట్‌: www.bitmesra.ac.in

22) బిషప్ హేబర్ కాలేజ్, తిరుచిరాపల్లి, తమిళనాడు.

వెబ్‌సైట్‌: www.bhc.edu.in

23) బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.bujhansi.org

24) ఉస్మానియా యూనివర్సిటీ, హైద‌రాబాద్‌, ఆంధ్రప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.osmania.ac.in

25) ఆంధ్రయూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.andhrauniversity.edu.in

26) లక్నో యూనివర్సిటీ, లక్నో.

వెబ్‌సైట్‌: www.lkouniv.ac.in

27) డాక్టర్ హరిసింగ్‌గౌర్ సాగర్ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.dhsgsu.ac.in

28) జివాజీ యూనివర్సిటీ, గ్వాలియర్, మధ్యప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.jiwaji.edu

29) భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.dbrau.ac.in

30) బిలాస్‌పూర్ యూనివర్సిటీ, బిలాస్‌పూర్, ఛండీగర్.

వెబ్‌సైట్‌: www.bilaspuruniversity.ac.in

31) యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌, హైద‌రాబాద్‌.

వెబ్‌సైట్‌: www.uohyd.ac.in

32) యూనివ‌ర్సిటీ ఆఫ్ మైసూర్‌, మైసూర్‌.

వెబ్‌సైట్‌: www.uni-mysore.ac.in

33) యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్‌, చెన్నై.

వెబ్‌సైట్‌: www.unom.ac.in

34) యూనివ‌ర్సిటీ ఆఫ్ జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్‌.

వెబ్‌సైట్‌: www.jammuuniversity.in

35) పంజాబీ యూనివ‌ర్సిటీ, పాటియాల‌

వెబ్‌సైట్‌: http://punjabiuniversity.ac.in

36) సంబ‌ల్‌పూర్ యూనివ‌ర్సిటీ, సంబ‌ల్‌పూర్.

వెబ్‌సైట్‌: http://suniv.ac.in

37) నాగ్‌పూర్ యూనివ‌ర్సిటీ, నాగ్‌పూర్‌.

వెబ్‌సైట్‌: www.nagpuruniversity.org

38) గురునాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీ, అమృత్‌స‌ర్‌.

వెబ్‌సైట్‌: www.gndu.ac.in

39) అల‌గ‌ప్పా యూనివ‌ర్సిటీ, క‌రైకుడి.

వెబ్‌సైట్‌: www.alagappauniversity.ac.in

40) బుందేల్‌ఖండ్ యూనివ‌ర్సిటీ, ఝూన్సీ.

వెబ్‌సైట్‌: www.bujhansi.org

దూరవిద్య ద్వారా లైబ్రరీసైన్స్ కోర్సును అందిస్తున్న విద్యాసంస్థలు:

1) ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూఢిల్లీ.

వెబ్‌సైట్‌: www.ignou.ac.in

2) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైద్రాబాద్, ఆంధ్రప్రదేశ్.

వెబ్‌సైట్‌: www.braou.ac.in

3) ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

వెబ్‌సైట్‌: http://anucde.info

4) కోటా ఓపెన్ యూనివర్సిటీ, రాజస్థాన్.

వెబ్‌సైట్‌: www.vmou.ac.in

5) నలంద ఓపెన్ యూనివర్సిటీ, బీహార్.

వెబ్‌సైట్‌: www.nalandaopenuniversity.com

6) యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, నాసిక్.

వెబ్‌సైట్‌: http://ycmou.digitaluniversity.ac

7) మధ్యప్రదేశ్ భోజ్ ఓపెన్ యూనివర్సిటీ, భోపాల్.

వెబ్‌సైట్‌: www.bhojvirtualuniversity.com

8) డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.

వెబ్‌సైట్‌: www.baou.edu.in

9) కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూర్.

వెబ్‌సైట్‌: http://karnatakastateopenuniversity.in

10) నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ, కోల్‌కతా.

వెబ్‌సైట్‌: http://wbnsou.ac.in

11) యు.పి. రాజర్షిటాండన్ ఓపెన్ యూనివర్సిటీ, అలహాబాద్.

వెబ్‌సైట్‌: www.uprtou.ac.in

Posted Date: 31-12-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌