• facebook
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ దరఖాస్తులకు ఆహ్వానం 

హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబరు-అక్టోబరు 2021 నుంచి సెషన్‌ ప్రారంభమవుతుంది.

2020 ఫాల్‌లో ప్రారంభమైన సెషన్‌లో 40 మంది పీహెచ్‌డీ స్కాలర్లు ప్రవేశం పొందారు. ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

ఏయే విభాగాలు?

ఇంజినీరింగ్, అప్లైడ్‌ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌లో 2021 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు. అప్లైడ్‌ సైన్సెస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌Ãలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, టెక్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ల మీద పరిశోధనాసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంగ్లిష్, అమెరికన్‌ లిటరేచర్, ఇండియన్‌ రైటింగ్స్‌ ఇన్‌ ఇంగ్లిష్, విమెన్స్‌ రైటింగ్, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్, కల్చరల్‌ అండ్‌ గాంధియన్‌ స్టడీస్, ప్రొఫెషనల్‌ ఎథిక్స్, ఫిలాసఫీ మొదలైన అంశాల మీద పీహెచ్‌డీ చేయొచ్చు. 

అసిస్టెంట్‌షిప్‌: ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్లకు నెలకు రూ.25,000 అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది. వీరికి మహీంద్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఈ స్కాలర్లు వారానికి ఎనిమిది గంటలపాటు బోధించాల్సి ఉంటుంది. 

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: https://www.mahindraecolecentrale.edu.in/
 

Posted Date: 16-06-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌