• facebook
  • whatsapp
  • telegram

రూరల్‌ డెవలప్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులు

నూట ఇరవై ఒక్క కోట్ల జనాభా ఉన్న మన దేశంలో గ్రామీణ ప్రాంతాలే అధికం. ప్రపంచీకరణ పేరుతో ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలు నగరాల్లో కొలువుదీరినా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందడుగేస్తుంది. అక్కడి ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రయోగాత్మక విధానాలు సమర్థంగా అమలు కావాలి. వారిని ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణులకు పరిచయం చేయాలి. ప్రభుత్వం చేపట్టే పథకాలను సక్రమంగా అమలు చేయాలి. ఈ పనులన్నీ జరగాలంటే సమర్థులైన నిపుణులు కావాలి. దీనికోసం పుట్టుకొచ్చినవే రూరల్‌డెవలప్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులు.

కోర్సు స్వభావం:

రూరల్ మేనేజ్‌మెంట్ / రూరల్ డెవలప్‌మెంట్ కోర్సును అభ్యసించే విద్యార్థులకు గ్రామీణ ప్రాంత పరిస్థితులపై అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో వారు పనిచేయడానికి అవసరమైన శిక్షణ అందిస్తారు. ప్రాజెక్టువర్క్‌ను అప్పగిస్తారు. ఇందులో భాగంగా వ్యవసాయ క్షేత్రాలు, అటవీ భూములు, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలను సందర్శించాల్సి ఉంటుంది. కోర్సులో ప్రాథమికంగా అయిదు అంశాలుంటాయి. అవి:

1) విద్యార్థులను గ్రామీణాభివృద్ధిలో భాగ‌స్వామ్యుల‌ను చేయడం.

2) గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలియజేయ‌డం.

3) రూరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు ప్రపోజల్స్ తయారు చేయడం.

4) సూక్ష్మ ప్రణాళిక తయారు చేయడం, వాటి అమలు, పర్యవేక్షణ ఇతర నైపుణ్యాలను పెంచడం.

ఇవన్నీ విద్యార్థులను గ్రామీణాభివృద్ధిలో నిపుణులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి. ఈ కోర్సులను కార్పొరేట్ సంస్థల‌ అవసరాలను తీర్చేవిధంగా రూపొందించారు. కొన్ని యూనివర్సిటీల్లో ఎంబీఏలో రూరల్ మేనేజ్‌మెంట్ ఒక స్పెషలైజేషన్‌గా ఉంది.

కోర్సులకు పెరుగుతున్న డిమాండ్:

విస్తృతమైన ఉద్యోగావకాశాలతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండటంతో ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కోర్సును నిర్వహించే విద్యాసంస్థల్లో మల్టీనేషనల్ కంపెనీలు ప్రాంగణ నియామకాలు కల్పిస్తున్నాయి.

పుష్కలమైన అవకాశాలు:

గ్రామీణ ప్రాంత పరిస్థితులపై అవగాహన ఉండి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన శిక్షణ పొందిన వారికి విస్తృతమైన అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలూ రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూరల్ డెవలప్‌మెంట్ కోర్సు చేసినవారిని నియ‌మించుకుంటున్నాయి.

ప్రభుత్వ రంగంలో: విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగులు (మహిళా, శిశు, గిరిజన, కార్మిక, మైనార్టీ సంక్షేమ విభాగాలు), రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఏజెన్సీలు, రాష్ట్ర జీవనాభివృద్ధి సంస్థలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్ఐపీసీసీడి), సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు, నాబార్డ్, సీపీఏఆర్టీ.

అంతర్జాతీయ సంస్థల్లో: యునిసెఫ్‌, యూఎన్‌డీపీ, డీఎఫ్ఐడీ, ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, పాత్ ఇంటర్నేషనల్, రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్, కేర్, సీఆర్‌వై, యూఎస్ఏఐడీ, యూనిఫెమ్, వాటర్ ఎయిడ్, యాక్షన్ ఎయిడ్, చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్, సేవ్ ది చిల్డ్రన్, వరల్డ్ విజన్, జైకా, ఆక్స్‌ఫామ్, సైట్ సేవర్స్ ఇంటర్నేషనల్, ఎస్ఓఎస్, కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్, అగాఖాన్ ఫౌండేషన్, సిన్‌టన్స్ ఫౌండేషన్, ప్లాన్ ఇంటర్నేషనల్, గోల్ఇండియా, సీసీఎఫ్, హ్యాండీకాప్ ఇంటర్నేషనల్, సీడ్స్.

పరిశ్రమల్లో:  బీహెచ్ఈఎల్, సెయిల్, గెయిల్, ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా లిమిటెడ్.

కార్పొరేట్ సెక్టార్‌లో: ఉషామార్టిన్, ఆదిత్యబిర్లా, ఐటీసీ, టాటా, విప్రో, జిందాల్, వేదాంత స్టీల్స్,

ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(ఐఐఆర్డీ), పీఆర్ఐఏ, ప్రయాస్, ప్రదాన్, బంధన్, జననీ, ప్రథమ్, సినీ, చేతన, సులభ్ ఇంటర్నేషనల్, ప్రగ్యా, బేసిక్స్, చైల్డ్‌లైన్ ఫౌండేషన్, నవజ్యోతి ఫౌండేషన్, గ్రామ వికాస ట్రస్ట్, టాటా స్టీల్ గ్రామీణాభివృద్ధి సంస్థ, నాంది ఫౌండేషన్, రూమ్ టు రీడ్, సేవా, రామకృష్ణ మిషన్, వాలంటరీ హెల్త్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా, రతన్ టాటా ట్రస్టు, భారత్ సేవాశ్రమ సంఘం.

విధులు:

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి.

ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల పల్లె ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

గ్రామాల అభివృద్ధికి రూపొందించిన పథకాలను అమలు చేయాలి.

ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలి.

ప్రస్తుతం ఉన్న సంప్రదాయ కోర్సుల‌తో పోలిస్తే గ్రామీణాభివృద్ధి కోర్సులు చేసిన వారికి ఉద్యోగావ‌కాశాలు అధికంగా ఉన్నాయి. ఈ వృత్తిని ఎంచుకున్న వారికి భార‌త‌దేశం అంత‌టా ప‌ర్యటించే వీలు ఉంటుంది. వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్రజ‌ల‌తో క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం ఉంది. త‌మ వంతుగా స‌మాజానికి సేవ చేయాల‌నుకునేవారు గ్రామీణాభివృద్ధి కోర్సుల‌ను ఎంచుకోవ‌డం ఉత్తమం. ప్రతిభ‌ను స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకుంటే అంత‌ర్జాతీయ సంస్థల్లో ప‌నిచేసే అవ‌కాశం ల‌భిస్తుంది. ఇంత‌టి విశిష్టత క‌లిగిన ఈ కోర్సుల‌ను మ‌న‌దేశంలో చాలా యూనివ‌ర్సిటీలు అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన న‌గ‌రాల్లోని యూనివ‌ర్సిటీల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సుల‌ను అందిస్తున్న యూనివర్సిటీలు/ విద్యాసంస్థలు: చాలా యూనివ‌ర్సిటీలు/ విద్యాసంస్థలు రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ డెవ‌ల‌ప్‌మెంట్‌ విభాగంలో పీజీ, ఎంబీయే, పీహెచ్‌డీ(ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్), పీజీడిప్లొమా కోర్సుల‌ను అందిస్తున్నాయి.

అవి:

1) అమిటీ యూనివర్సిటీ,

నోయిడా, ఉత్తరప్రదేశ్.

వెబ్‌సైట్: http://agbs.in/

2) గోవింద్ వల్లభ్‌పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్, 

అలహాబాద్, ఉత్తరప్రదేశ్.

వెబ్‌సైట్: http://www.gbpssi.nic.in/    

3) దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ, 

హరిద్వార్, ఉత్తరాంచల్.

వెబ్‌సైట్: http://www.dsvv.ac.in/

4) గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీ, 

గాంధీగ్రామ్, తమిళనాడు.

వెబ్‌సైట్: http://www.ruraluniv.ac.in/

5) గుజరాత్ విద్యాపీఠ్, 

అహ్మదాబాద్, గుజరాత్.

వెబ్‌సైట్: http://www.gujaratvidyapith.org/

6) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఆర్ఎమ్ఏ), 

ఆనంద్, గుజరాత్.

వెబ్‌సైట్: https://www.irma.ac.in/

7) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఐబీఆర్ఏడీ), 

కోల్‌కత, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.ibradindia.org/    

8) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,

ఖరగ్‌పూర్, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/

9) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 

కోల్‌కత, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: https://www.iimcal.ac.in/

10) కళ్యాణి యూనివర్సిటీ, 

కళ్యాణి, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.klyuniv.ac.in/

11) రామకృష్ణా మిషన్ వివేకానంద యూనివర్సిటీ, 

బేలూర్‌మఠ్, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.rkmvu.ac.in/    

12) యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్, 

డార్జిలింగ్, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.nbu.ac.in/

13) విశ్వభారతి యూనివర్సిటీ, 

శాంతినికేతన్, పశ్చిమబెంగాల్.

వెబ్‌సైట్: http://www.visva-bharati.ac.in/

14) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఐఆర్ఎం), 

జైపూర్, రాజస్థాన్.

వెబ్‌సైట్: http://www.iirm.ac.in/    

15) కేఐఐటీ యూనివర్సిటీ, 

భువనేశ్వర్, ఒడిశా.

వెబ్‌సైట్: http://www.kiit.ac.in/    

16) జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 

భువనేశ్వర్,  ఒడిశా.

వెబ్‌సైట్: http://w3.ximb.ac.in/

17) మధ్యప్రదేశ్ భోజ్ ఓపెన్ యూనివర్సిటీ, 

భోపాల్, మధ్యప్రదేశ్.

వెబ్‌సైట్: http://www.bhojvirtualuniversity.com/

18) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, 

రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ.

వెబ్‌సైట్: http://www.nird.org.in/    

19) టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, 

ముంబయి,  మహారాష్ట్ర.

వెబ్‌సైట్: http://www.tiss.edu/

20) జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (ఎక్స్ఎస్ఎస్), 

రాంచీ,  జార్ఖండ్.

వెబ్‌సైట్: http://www.xiss.ac.in/

Posted Date: 15-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌