• facebook
  • whatsapp
  • telegram

మనూలో యూజీ, పీజీ

ప‌ది, ఇంట‌ర్ అర్హ‌త‌, ఒక స‌బ్జెక్టుగా ఉర్దూ త‌ప్ప‌నిస‌రి

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), హైదరాబాద్‌... డిప్లొమా, యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో కొన్ని కోర్సుల్లోకి తీసుకుంటారు. మిగిలినవాటికి అకడమిక్‌ మెరిట్‌ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. 

పరీక్షతో భర్తీ చేసే కోర్సులు

పీహెచ్‌డీ: ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, అరబిక్, పర్షియన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, ఉమెన్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్, సోషల్‌ వర్క్, ఇస్లామిక్‌ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎడ్యుకేషన్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌. 

పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ (సీఎస్‌), ఎంఎడ్‌.

యూజీ కోర్సులు: బీటెక్‌ (సీఎస్‌), బీఎడ్‌

పాలిటెక్నిక్‌ డిప్లొమాలు: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎల్రక్టికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌.

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఎడ్‌)

అకడమిక్‌ మెరిట్‌తో...

పీజీ: ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, పర్షియన్, ఉమెన్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్, సోషల్‌ వర్క్, ఇస్లామిక్‌ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఎంకాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, 

యూజీ: బీఏ, బీకాం, బీఎస్సీ. ఒకేషనల్‌ విధానంలో మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ.

పీజీ డిప్లొమా: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌. 

డిప్లొమా: ఇస్లామిక్‌ స్టడీస్‌ 

ఈ సంస్థకు హైదరాబాద్‌ (గచ్చిబౌలి)లో ప్రధాన క్యాంపస్‌తోపాటు కడప, లక్నో, శ్రీనగర్, భోపాల్, బీదర్, దర్భంగా, అసంసోల్, బెంగళూరు, ఔరంగాబాద్, సంబల్, నూహ్, కటక్‌ల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక కోర్సు అందిస్తున్నారు. కడప క్యాంపస్‌లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు నడుపుతున్నారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో అన్ని కోర్సులూ ఉన్నాయి. పరీక్ష లేదా అకడమిక్‌ మెరిట్‌ ప్రకారం ఆయా క్యాంపస్‌ల్లో ఉన్న కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.  

అర్హత: ఏ కోర్సులో చేరడానికైనా పది లేదా ఇంటర్‌లో ఉర్దూ ఒక సబ్జెక్టుగా చదివుండడం తప్పనిసరి. పీహెచ్‌డీలకు పీజీలో 55 శాతం, పీజీ కోర్సులకు యూజీలో 45 శాతం, యూజీ కోర్సులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పాలిటెక్నిక్‌ కోర్సులకు పదో తరగతిలో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్‌ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులూ అర్హులే.

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంట్రన్స్‌ ఆధారిత ప్రోగ్రాములకు జులై 12. మెరిట్‌ ఆధారిత ప్రోగ్రాములకు సెప్టెంబరు 4. 

ప్రవేశ పరీక్ష తేదీలు: జులై 29, 30, 31.

వెబ్‌సైట్‌: https://manuu.edu.in/
 

Posted Date: 16-06-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌