• facebook
  • whatsapp
  • telegram

బ‌యోటెక్నాల‌జీలో బంగారు భవిత!

జంతువులు,మొక్కల్లో కోరిన మార్పులు చేయ‌డం లేదా వివిధ ప్రయోజ‌నాల కోసం సూక్ష్మజీవుల‌ను ఉత్పత్తి చేయ‌డం, ఆర్థిక ప‌రంగా వాటిని ఉప‌యోగించ‌డాన్ని జీవ‌సాంకేతిక‌శాస్త్రమ‌ని అంటారు. నేడు బయోటెక్నాలజీ రంగంలో విద్య, ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ఫార్మాస్యూటికల్, డయాగ్నోస్టిక్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంటల్ త‌దిత‌ర‌ రంగాలకు ఉపకరించే ఉత్పత్తులను బయోటెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. దీనిలో ర‌సాయ‌న శాస్త్రం, గ‌ణితం, ఇంజినీరింగ్‌తో పాటు ఆరోగ్యం, వైద్యం, వ్యవ‌సాయం, ప‌శుసంవ‌ర్ధకం, ప‌ర్యావ‌ర‌ణం, క‌ణ‌జీవ‌శాస్త్రం, మెరైన్ బ‌యాల‌జీ త‌దిత‌ర అంశాలున్నాయి. మొక్కలు, జంతువులకు సంబంధించిన‌ జన్యు సమాచారాన్ని అభివృద్ధి పరిచి, మానవాళికి మేలు చేకూర్చడంలో బయోటెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అందుకే బయోటెక్నాలజీని 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన అనువ‌ర్తిత విజ్ఞాన‌శాస్త్రంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయోటెక్నాలజీ రంగంలో విద్య, ఉపాధి, ప‌రిశోధ‌న‌ల్లో గ‌ల‌ అవకాశాలను గురించి తెలుసుకుందాం....

ఎన్నో ప్రయోజ‌నాలు

జీవ సాంకేతిక ప‌రిజ్ఞానంతో మ‌నుషుల్లో వ‌చ్చే అనువంశిక‌, న‌యంకాని వ్యాధుల‌ను త‌గ్గించేందుకు కొత్త వ్యాధి నిరోధ‌కాలను త‌యారు చేస్తున్నారు. వివిధ వ్యాధుల‌ను త‌ట్టుకునే సంక‌ర‌జాతి మొక్కల‌ను, జంతువుల‌ను వృద్ధి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను కనుక్కోవ‌డం, అడ‌వుల సంర‌క్షణ‌... జ‌న్యుమార్పుల‌ను చేసి కొత్త జీవులను ఉత్పత్తి చేయ‌డం, క‌ణ‌జాల వ‌ర్దనం, వ్యవ‌సాయం, ఔష‌ధం, త‌దిత‌ర‌ రంగాల‌ ప‌రిశోధ‌న‌ల్లో జీవ‌సాంకేతిక శాస్త్ర ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నారు.

పెరుగుతున్న ప్రాధాన్యం

బ‌యోటెక్నాల‌జీలో విద్య న‌భ్యసించ‌డానికి మ‌న దేశంలో అనేక కోర్సులున్నాయి. ఈ ప‌రిజ్ఞానాన్ని వివిధ పారిశ్రామిక రంగాల్లోనూ, వృత్తుల్లోనూ వినియోగించ‌డంవ‌ల్ల ఈ కోర్సుకు మరింత ప్రాముఖ్యం పెరిగింది. కోర్సు ప్రాధాన్యం గురించి యువ‌త‌లో చైత‌న్యం క‌లిగించేందుకు ప‌లు సంస్థలు, విశ్వవిద్యాల‌యాలు కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేసి డిగ్రీ, పీజీ స్థాయుల్లో అనేక కోర్సుల‌ను అందిస్తున్నాయి.

కోర్సుల వివ‌రాలు

ఇంట‌ర్మీడియ‌ట్ సైన్స్ గ్రూప్‌ (ఎంపీసీ / బైపీసీ) వారికి ప‌రీక్షల ద్వారా ప‌లు ప్రతిష్ఠాత్మక ఐఐటీ సంస్థలు, విశ్వవిద్యాల‌యాలు బీఎస్సీ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ త‌దిత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తున్నాయి. మరికొన్ని వ‌ర్సిటీలు నేరుగా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అనేక ప్రముఖ సంస్థల్లో బయోటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌- సీబీఈఈ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ప్రకటన సాధారణంగా మార్చిలో వెలువడుతుంది. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

డిగ్రీ / పీజీ స్థాయి కోర్సులు

బీఎస్సీ (బ‌యోటెక్నాల‌జీ)

బీఎస్సీ (బయోపార్మటిక్స్)

బీటెక్ (బ‌యోటెక్నాల‌జీ)

ఎంఎస్సీ (బ‌యోటెక్నాల‌జీ)

ఎంఎస్సీ (అగ్రిక‌ల్చర్ బ‌యోటెక్నాల‌జీ)

ఎంఎస్సీ / ఎంవీఎస్సీ (యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ)

ఎంఎస్సీ (మెరైన్ బ‌యోటెక్నాల‌జీ)

ఎంఎస్సీ (మెడిక‌ల్ బ‌యోటెక్నాల‌జీ)

ఎంటెక్ (బ‌యోటెక్నాల‌జీ)

ఎంటెక్ (బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్ / బ‌యోటెక్నాల‌జీ)

ఎంబీఏ (బ‌యెటెక్నాల‌జీ)

వివిధ విశ్వవిద్యాల‌యాలు బయోటెక్నాలజీలో ఆధునిక స్పెషలైజేషన్లను కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు గోవా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. మెరైన్‌ బయోటెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నాయి. సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీని అందిస్తోంది. అస్సాంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌సి. మాలెక్యులర్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ ఉంది. అలాగే పుణే యూనివర్సిటీ రెండేళ్ళ ఎంబీఏ బ‌యోటెక్నాల‌జీ, జేఎన్‌యూ, జిప్‌మ‌ర్ వ‌ర్సిటీలు బయోఫార్మటిక్స్ కోర్సుల‌ను అందిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థలు ఈ ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ప‌రిశోధ‌నావ‌కాశాలు

సామర్థ్యం, అవ‌స‌రాన్ని బ‌ట్టి అడ్వాన్స్‌డ్ పీహెడ్‌డీ, పోస్ట్ డాక్టోర‌ల్ బ‌యోటెక్నాల‌జీ కోర్సుల‌నూ ప‌లు విశ్వవిద్యాల‌యాలు అందిస్తున్నాయి. బయోటెక్నాలజీలో ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహిస్తోన్న దేశాల్లో భారత్‌ అగ్రశ్రేణిలో ఉంది. మానవ జీనోమ్‌ ప్రాజెక్టు, మూలకణ పరిశోధన, జన్యు పరివర్తిత పంటలకు సంబంధించి మనదేశంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) ఏర్పాటైంది. బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులు ఈ విభాగం అనేక రకాల ఫెలోషిప్‌లను అందిస్తోంది. కౌన్సెల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌, న్యూఢిల్లీ) పరిధిలోని పరిశోధన సంస్థల్లో కూడా బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధనలు జరుగుతున్నాయి.

ఉద్యోగావ‌కాశాలు

బ‌యోటెక్నాల‌జీలో విద్యనభ్యసించిన డిగ్రీ, పీజీ ప‌ట్టభ‌ద్రుల‌కు మ‌న దేశంతోపాటు విదేశాల్లోనూ ఉపాధి అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. బయోటెక్‌ కోర్సులు చేసినవారికి ప్రైవేటు రంగంలో స్థాపించిన బెంగళూరు, లక్నో, గుర్గావ్‌లలోని బయోటెక్‌ పార్కులు, హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌ లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ రంగంలో ఉపాధితో పాటు ప‌రిశోధ‌న‌ల‌ను ప‌లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ అందిస్తున్నాయి. బ‌యోటెక్ అభ్యర్థుల‌కు ఫార్మా, అగ్రిక‌ల్చర్‌, హార్టిక‌ల్చర్, డెయిరీ త‌దిత‌ర రంగాల్లో ఉపాధి అవ‌కాశాల‌తోపాటు, ప‌రిశోధ‌న‌లు చేసే అవ‌కాశ‌ముంది.
మ‌న దేశంలో ప్రముఖ కంపెనీలైన డాబ‌ర్‌, రాన్‌బాక్సీ, హిందుస్థాన్ లీవ‌ర్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, థాప‌ర్ గ్రూప్‌, ఇండో అమెరిక‌న్ హైబ్రిడ్ సీడ్స్‌, బైకూన్ ఇండియా లిమిటెడ్‌, ఐడీపీఎల్‌, హిందుస్థాన్ యాంటిబ‌యోటిక్స్ త‌దిత‌ర సంస్థలు డిగ్రీ ప‌ట్టభ‌ద్రుల‌కు రూ.15 నుంచి 35వేల జీతంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ ప‌రిశోధ‌న కేంద్రాల్లో రూ. 15వేల వరకు నెల‌స‌రి జీతాన్ని పొందే ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ / పీజీ స్థాయిలో బ‌యోటెక్నాల‌జీ కోర్సును అందించే విశ్వవిద్యాల‌యాలు.

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ - హైద‌రాబాద్‌

http://www.uohyd.ac.in/

ఉస్మానియా విశ్వవిద్యాల‌యం - హైద‌రాబాద్‌

http://www.osmania.ac.in/

కాక‌తీయ విశ్వవిద్యాల‌యం - వ‌రంగ‌ల్‌

http://www.kakatiya.ac.in/

ఆంధ్రా విశ్వవిద్యాల‌యం - విశాఖ‌ప‌ట్నం

http://www.andhrauniversity.edu.in/

శ్రీ వెంక‌టేశ్వర విశ్వవిద్యాల‌యం - తిరుప‌తి

http://svuniversity.ac.in/

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల‌యం - గుంటూరు

http://www.nagarjunauniversity.ac.in/

ఆదిక‌వి న‌న్నయ విశ్వవిద్యాల‌యం - రాజ‌మండ్రి

http://www.nannayauniversity.info/

శ్రీ కృష్ణ దేవ‌రాయ విశ్వవిద్యాల‌యం - అనంత‌పురం

http://skuniversity.org/

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం - తిరుప‌తి

http://www.spmvv.ac.in/

ద్రావిడ విశ్వవిద్యాల‌యం - కుప్పం

http://www.dravidianuniversity.ac.in/

కృష్ణా విశ్వవిద్యాల‌యం - మ‌చిలీప‌ట్నం

http://www.krishnauniversity.ac.in/

రాయ‌ల‌సీమ విశ్వవిద్యాల‌యం - క‌ర్నూలు

http://www.rayalaseemauniversity.ac.in/index.php

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - హైద‌రాబాద్‌

http://www.jntuh.ac.in/new/

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - కాకినాడ‌

http://www.jntuk.edu.in/

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - అనంత‌పురం

http://jntua.ac.in/

జాతీయ స్థాయిలో డిగ్రీ , పీజీ కోర్సునందిచే ముఖ్య సంస్థలు / విశ్వవిద్యాల‌యాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ - న్యూ ఢిల్లీ

http://www.aiims.edu/

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ - ఛండీఘ‌ర్

http://pgimer.edu.in/

సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ - ల‌క్నో

http://sgpgi.ac.in/

జిప్‌మ‌ర్ - పాండిచ్చేరి

http://jipmer.edu.in/

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగ‌ళూరు

http://iisc.ernet.in/

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ - ముంబ‌యి, ఢిల్లీ, కాన్పూర్‌

http://www.jnu.ac.in/

ఎంఎస్ విశ్వవిద్యాల‌యం - బ‌రోడ‌

http://www.msubaroda.ac.in/

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యో ఇన్‌ఫార్మేటిక్స్ అండ్ బ‌యోటెక్నాల‌జీ - బెంగ‌ళూరు

http://www.ibab.ac.in/

త‌మిళనాడు అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ - కోయంబ‌త్తూరు

http://tnau.ac.in/

అన్నామ‌లై విశ్వవిద్యాల‌యం - చెన్నై

http://annamalaiuniversity.ac.in/index1.php

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియ‌న్ టెక్నాల‌జీ - చెన్నై

http://niot.res.in/

బెనార‌స్ హిందూ విశ్వవిద్యాల‌యం - వార‌ణాసి

http://www.bhu.ac.in/

యూనివ‌ర్సిటీ ఆఫ్ అలహాబాద్ - అలహాబాద్

http://www.allduniv.ac.in/

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల‌యం - న్యూ ఢిల్లీ

http://www.jnu.ac.in/

యూనివ‌ర్సిటీ ఆఫ్ ల‌క్నో - ల‌క్నో

http://www.lkouniv.ac.in

Posted Date: 17-09-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌