• facebook
  • whatsapp
  • telegram

దివ్యాంగుల ఉన్న‌త విద్యకు చిరునామా!

ఎన్ఐఈపీఐడీలో ప్ర‌త్యేక కోర్సులు

ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

దివ్యాంగుల ఉన్నత విద్య కోసం స్థాపించినదే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ). ఇది అటానమస్ సంస్థ. గతంలో దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అని పిలిచేవారు. ఎన్ఐఈపీఐడీని భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్(దివ్యాంగ్జన్) విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎన్ఐఈపీఐడీ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ (మనోవికాస్నగర్)లో ఉంది. ప్రాంతీయ కేంద్రాలు నోయిడా/ న్యూదిల్లీ, కోల్కతా, ముంబైలో ఉన్నాయి. 

సాధారణ వ్యక్తులతో సమానంగా దివ్యాంగులు కూడా సమాజంలో గుర్తింపు పొందాలనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగానే వారి ఉన్నత విద్య కోసం వివిధ కోర్సులు ప్రవేశపెట్టారు. తాజాగా 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కోర్సుల్లో చివరి సంవత్సరం/  సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. సీట్ల కేటాయింపులో నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారు. కోర్సుల్లో చేరిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తాయి. నోయిడాలో మినహా సికింద్రాబాద్, కోల్కతా, నవీ ముంబయిలో వసతి సౌకర్యం ఉంది.

కోర్సులు.. వివరాలు

1) ఎన్ఐఈపీఐడీ, హెడ్క్వార్టర్స్(సికింద్రాబాద్)లో ప్రోగ్రాములు

ఎంఫిల్రిహెబిలిటేషన్సైకాలజీ

ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ/ ఎస్టీలు 50 శాతం మార్కులు సాధిస్తే చాలు. మొత్తం 15 సీట్లు ఉన్నాయి. 

ఎంఈడీ స్పెషల్ఎడ్యుకేషన్ (ఐడీ) 

బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్/ ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్)తోపాటు బీఈడీ జనరల్ పట్టా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కనీసం 50శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 45శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇది రెండేళ్ల కోర్సు. 27 సీట్లు ఉన్నాయి. 

బీఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ) 

ఈ కోర్సులో చేరాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50శాతం మార్కులతో బీఎస్సీ/ బీఏ/ బీకాం ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 45శాతం మార్కులు సాధించాలి. కోర్సు వ్యవధి రెండేళ్లు. 33 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

పీజీ డిప్లొమా ఇన్ఎర్లీ ఇంటర్వెన్షన్(పీజీడీఐఈ) 

ఇది ఏడాది కోర్సు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీఏఎమ్మెస్, బీయూఎమ్మెస్, బీహెచ్ఎమ్మెస్, బీఎన్వై/ తత్సమాన ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బీఓటీ, బీపీటీ, బీఏఎస్ఎల్పీ/ తత్సమాన ఉత్తీర్ణత, బీఎస్సీ నర్సింగ్, పీజీ ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, స్పెషల్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇతరులు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీలకు 45శాతం మార్కులు ఉండాలి. 22 సీట్లున్నాయి. 

2) ఎన్ఐఈపీఐడీ ప్రాంతీయ కేంద్రం, కోల్కతాలో ప్రోగ్రాములు

బీఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ), 

ఎంఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ) 

ఈ రెండు కోర్సులవ్యవధి రెండేళ్ల చొప్పున ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/   బీఏ/  బీకాం లేదా ఏదైనా డిగ్రీ ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీలు 45శాతం మార్కులు సాధించాలి. 33 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. 

3) ఎన్ఐఈపీఐడీ ప్రాంతీయ కేంద్రం, నవీ ముంబయి ప్రోగ్రాములు

బీఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ)

ఎంఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ)  

ఈ రెండు కోర్సులవ్యవధి రెండేళ్ల చొప్పున ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/   బీఏ/  బీకాం లేదా ఏదైనా డిగ్రీ ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీలు 45శాతం మార్కులు సాధించాలి. 22 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. 

4) ఎన్ఐఈపీఐడీ ప్రాంతీయ కేంద్రం, నోయిడా ప్రోగ్రాములు

బీఈడీ స్పెషల్ఎడ్యుకేషన్(ఐడీ) 

ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. దీన్ని గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్త యూనివర్సిటీ అందిస్తుంది. పూర్తి వివరాలకు www.ipu.ac.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. 

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము జనరల్/ ఓబీసీ/ బీసీ అభ్యర్థులు రూ.1300, ఎస్సీ/  ఎస్టీ/  పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. సికింద్రాబాద్లో దరఖాస్తు చేయాలనుకునే వారు Director, NIEPID, Secunderabad పేరిట, ఇతరులు ఆయా ప్రాంతీయ కేంద్రాల పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఆగస్టు 30, 2021 తుది గడువు. రూ.200 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

వెబ్‌సైట్‌: https://www.niepid.nic.in/

Posted Date: 24-07-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌