• facebook
  • whatsapp
  • telegram

కేంద్రీయ‌ వ‌ర్సిటీల్లో ప్ర‌వేశాల‌కు సీయూసెట్‌!  

సీయూ సెట్‌ - 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

డిగ్రీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లోకి అడ్మిషన్

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. వీటిలో చేరడానికి దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఈ సంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్) రాయాల్సిందే. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ద్వారా దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్/ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా సీయూ సెట్  నోటిఫికేషన్ విడుదలైంది. 

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: 

అసోం యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ హర్యానా, జమ్మూ, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, సౌత్ బీహార్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. 

ఇంటిగ్రేటెడ్/ డిగ్రీ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్, బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (ఆనర్స్) ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఈడీ, బీఎస్సీ (ఆనర్స్), బీఏ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్/ డ్యుయల్ డిగ్రీ బీఏ-ఎంఏ, ఇంటిగ్రేటెడ్ బీఏ-బీఈడీ, డిప్లొమా, బీఏ, బీబీఏ, సర్టిఫికెట్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీఏ-ఎల్ఎల్బీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఏ, బీపీఏ కోర్సుల్లో వివిధ ప్రోగ్రామ్ లు  అందుబాటులో ఉన్నాయి. 

పీజీలు

ఎంఏ, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్/డిప్లొమా, ఎంపీఏ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంఏ/ ఎమ్మెస్సీ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎంఆర్క్, ఎంఫార్మా (ఫార్మకాలజీ), ఎంఫార్మా, ఎమ్మెస్సీ బీఈడీ, ఎంసీఏ, ఎంఏ/ ఎమ్మెస్సీ, ఎంపీహెచ్, ఎంకామ్, ఎంబీఏ, ఎంహెచ్ఎంసీటీ, ఎంటీటీఎం, ఎంలైబ్రరీ, ఎల్ఎల్బీ, సర్టిఫికెట్ కోర్సులు, ఎంపీఈఎస్, ఎంపీఈడీ, ఎంటెక్ కోర్సుల్లో వివిధ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. 

అర్హత

ఇంటిగ్రేటెడ్/ డిగ్రీ కోర్సులను బట్టి చేరేవారు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో 10+2/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సు చేయాలనుకునేవారు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. 

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు సెప్టెంబ‌ర్ 1, 2021 తుది గ‌డువు. సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు ఫీజు చెల్లించ‌వ‌చ్చు. పీజీ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే వారిలో ఇత‌రులు రూ.200, ఎస్సీ/ ఎస్టీ/ ట్రాన్స్‌జండ‌ర్స్ రూ.75 చెల్లించాలి. డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ద‌ర‌ఖాస్తు చేసే వారిలో ఇత‌రులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ ట్రాన్స్‌జండ‌ర్స్ రూ.350 చెల్లించాలి. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: అనంత‌పురం, చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజయ‌వాడ‌, విశాఖ‌ప‌ట్న‌, విజ‌య‌న‌గ‌రం. 

తెలంగాణ‌: హైద‌రాబాద్/ సికింద్రాబాద్‌/ రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

పరీక్ష స్వరూపం

పీజీలకు: పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్ భాషలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఇందులో రెండు విభాగాలు పార్ట్ - ఏ, పార్ట్ - బి ఉంటాయి. పార్ట్ - ఎలో 25 ప్రశ్నలు (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ) వస్తాయి. పార్ట్ - బిలో 75 ప్రశ్నలు (అభ్యర్థి అర్హత సబ్జెక్టుల నుంచి) అడుగుతారు. కొన్ని స‌బ్జెక్టుల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌లో 100 ప్ర‌శ్న‌లు ఇంగ్లిష్‌/  వెర్బ‌ల్ ఎబిలిటీ, మ్యాథ్స్‌/  క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్ ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్ నుంచి వ‌స్తాయి. మ‌రికొన్ని స‌బ్జెక్టుల‌కు ప్ర‌శ్న‌ల‌న్నీ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, కంప్యూట‌ర్ బేసిక్స్‌, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, లాజిక‌ల్ రీజనింగ్‌కు సంబంధించిన‌వి ఉంటాయి. ప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కులుంటాయి.  త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. 

డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు: ఈ ప‌రీక్షనూ  కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు. 100 ప్ర‌శ్న‌లు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో వ‌స్తాయి. పార్ట్ - ఏలో 25 ప్రశ్న‌లు (ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, న్యూమెరిక‌ల్ ఎబిలిటీ) నుంచి పార్ట్ - బిలో 25 (ఫిజిక్స్‌), 25 (కెమిస్ట్రీ), 25 (మ్యాథ‌మెటిక్స్), 25 (బ‌యాల‌జీ) నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. కొన్ని స‌బ్జెక్టుల ప‌రీక్ష‌లో 100 ప్ర‌శ్న‌ల‌ను ఇంగ్లిష్‌, న్యూమెరిక‌ల్ ఆప్టిట్యూడ్‌/ డేటా ఇంట‌ర్ ప్రిటేష‌న్‌, అన‌లిటిక‌ల్ స్కిల్స్‌, రీజ‌రింగ్‌, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచే వ‌స్తాయి. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. రుణాత్మ‌క మార్కులంటాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. 

వంద మార్కుల‌ను నాలుగు సెష‌న్లుగా విభ‌జిస్తారు. ప్ర‌తి సెష‌న్‌లోనూ 25 ప్ర‌శ్న‌ల చొప్పున వ‌స్తాయి. ఇందులో క‌నీసం 3 సెష‌న్ల నుంచి స‌మాధానాలు రాయాలి. 

ప‌రీక్ష తేదీలు: 2021 సెప్టెంబరు 15, 16, 23, 24. 

వెబ్‌సైట్‌: https://cucet.nta.nic.in/
 

Posted Date: 19-08-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌