• facebook
  • whatsapp
  • telegram

'హార్టికల్చర్‌'లో బంగారు భవిత....

వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. కొన్ని శతాబ్దాలుగా ఇది భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పూలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం మనదేశానిదే. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్‌లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తూ విదేశీ ఎగుమతుల్లో తనదైన ముద్రను వేసి తిరుగులేని వాణిజ్య దిగ్గజంలా భారత్ అవతరించింది. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భౌగోళికంగా మొదటి స్థానాన్ని సంపాదించిన భారత్... మామిడి, అరటి, కొబ్బరి, జీడిపప్పు, బొప్పాయి, దానిమ్మ ఉత్పత్తుల్లోనూ అగ్రరాజ్యాల వ్యవసాయ ఉత్పత్తులకు దీటైన సమాధానంగా నిలిచింది. మన శాస్త్రవేత్తల నైపుణ్యాలకు నిదర్శనంగా అత్యధిక రాబడిని సంపాదించిపెట్టే 1596 రకాల నాణ్యమైన పంటలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేశారు. అందులో 134 రకాల పండ్లు, 485 రకాల కూరగాయలు, 115 రకాల అలంకార మొక్కలు, 476 రకాల మాదకద్రవ్యాలు, 50 రకాల ఔషధ మొక్కలు, 5 రకాల పుట్టగొడుగులు అధిక మొత్తంలో మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఉత్పత్తికి సంప్రదాయ, సాంకేతికత పరిజ్ఞానాల మేళవింపుతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించే ప్రక్రియే 'హార్టికల్చర్'. 

వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ అనేది అతి ముఖ్యమైన విధానం. దేశంలో శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో హార్టిక‌ల్చర్ ఒక‌టి. దేశ‌ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఊతమిచ్చిన రంగం ఇది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌పై పెరుగుతున్న శ్రద్ధ, నాణ్యమైన కూర‌గాయ‌ల‌పై పెరుగుతున్న మ‌క్కువ వ‌ల్ల హార్టిక‌ల్చర్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయరంగ జీడీపీలో హార్టికల్చర్ పాత్ర 30.4 శాతం. అసలు నిజమైన వ్యవసాయమంటేనే హార్టికల్చర్ అనే పరిస్థితి వచ్చిందంటే ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. దీనికి తోడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో హార్టికల్చర్ విద్యార్థులకు అవకాశాలు పుంఖానుపుంఖాలుగా ఉండటంవల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

కోర్సు స్వభావం, అర్హత‌లు..

వివిధ కళాశాల‌లు, విశ్వవిద్యాల‌యాలు అందించే హార్టిక‌ల్చర్ కోర్సులో అర్హత పొందాలంటే భౌతిక శాస్త్రం, ర‌సాయ‌న‌శాస్త్రం, వ్యవ‌సాయ/జీవ‌శాస్త్ర స‌బ్జెక్టుల్లో 10+2 (ఇంట‌ర్‌) పూర్తి చేసిన వారు 'PAT' (ప్రీ అగ్రికల్చరల్ టెస్ట్) లో ఉత్తీర్ణత సాధించాక రాష్ట్రస్థాయి వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్పులు చదివేందుకు అర్హులు. ఎంఎస్సీలో అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ పూర్తి చేసి పీహెచ్‌డీలో హార్టికల్చర్ చేసిన వారికి ఈ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు అపారం - వేతనాలు సంతృప్తికరం..

హార్టికల్చర్ కోర్సు పూర్తి చేసిన వారికి మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. బ్యాంకులు, ఇతర ఆర్థికరంగ సంస్థలు, విత్తన కంపెనీలు, సేల్స్ అండ్ మార్కెటింగ్... తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి బ్యాంకులు తమ సంస్థల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకు హార్టికల్చర్ పూర్తి చేసిన విద్యార్థులకే పెద్దపీట వేస్తున్నాయి. దేశ విదేశాల్లోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కశాశాలలు కూడా అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర బోధనా సిబ్బందిగా వీరినే నియమిస్తున్నాయి. వివిధ ఎరువులు, రసాయనాలు, విత్తనాల కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఆఫీసర్లుగా పని చేస్తూ నెలకు రూ. 25,000 నుంచి రూ. 30,000 వేతనం తీసుకుంటున్నవారు ఈ రంగంలో ఉన్నారు.

పబ్లిక్ సెక్టాలోని ఉద్యోగావకాశాలు ఇవే...

1. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులుగా...

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ)

డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), అగ్రికల్చరల్అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ)

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఆర్ఓ), డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)

నేషనల్ సీడ్ కార్పొరేషన్(ఎన్ఎస్‌సీ)

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

2. అసిస్టెంట్ డైరక్టర్ - హార్టికల్చర్ (రాష్ట్ర ప్రభుత్వ హోదాలో)

3. స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌లో జిల్లా ఉద్యానవన అధికారులు

4. దేశం, రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు

5. ఐఎఫ్ఎఫ్‌సీఓ లో హార్టికల్చ్‌ర్ నిపుణులు, టెలీఫార్మ్ నిపుణులు

6. హార్టికల్చర్ ఇన్‌స్పెక్టర్‌, ఫ్రూట్ అండ్ విజిటబుల్ ఇన్‌స్పెక్టర్‌, మార్కెటింగ్ ఇన్‌స్పెక్టర్‌లు

7. రిసెర్చ్ అసోసియేట్‌లు, సీనియర్ రిసెర్చ్ ఫెలో

8. రూరల్ హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారులు

9. సెక్షన్ అధికారులు (హార్టికల్చర్, ల్యాండ్‌స్కేపింగ్)

10. సీనియర్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ అధికారులు

11. కేవీకే (కృషి విజ్ఞాన్ కేంద్రం)లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అధికారులు

ప్రైవేటు రంగంలోనూ ఎర్ర తివాచీయే..

దేశ విదేశాల్లోని కొన్ని ప్రతిష్ఠాత్మక హోటళ్లు, రిసార్ట్‌లలో ఆయా సంస్థల్లోని ఉద్యానవనాల సౌందర్యాభివృద్ధికి కేవలం హార్టికల్చర్ చదివిన వారిని మాత్రమే నియమిస్తున్నారు. నగరాల్లోని నర్సరీల్లోనూ వీరికే ప్రాధాన్యం. వీటితోపాటు అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్‌లోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) లో కూడా హార్టికల్చర్ విద్యార్థులదే హవా.

సొంతంగా ఉపాధి అవకాశాలు..

వ్యవసాయ, ఉద్యానవనరంగాల్లో విద్య ద్వారా పూర్తిస్థాయి అవగాహన పొందినవారు సొంతంగా ఉపాధి అవకాశాలు ఏర్పరచుకునే వీలు కూడా ఉంది. దీని కోసం అగ్రికల్చరల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి అందులో నర్సరీ నిర్వహణ, పూలు, పండ్ల పెంపకం, పుట్టగొడుగులు, అలంకార మొక్కల పెంపకం, విత్తనాల ఉత్పత్తి, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్వహణ చేపట్టడంతోపాటు హార్చికల్చర్ ల్యాండ్ స్కేప్‌లో వృత్తివిద్య (ఒకేషనల్ కోర్సు) ద్వారా తరగతులను నిర్వహించవచ్చు.

దేశ వ్యాప్తంగా హార్టికల్చర్ కోర్సు అందిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాలు:

1. Acharya N.G. Ranga Agricultural University.

www.angrau.ac.in

2. Dr. YSR Horticultural University.

www.drysrhu.edu.in

3. Indian Agricultural Research Institute, New Delhi.

www.iari.res.in

4. Anand Agricultural University.

www.aau.in

5. Assam Agricultural University.

www.aau.ac.in

6. Bidhan Chandra Krishi Viswavidyalaya.

www.bckv.edu.in

7. Bihar Agricultural University.

www.bausabour.ac.in

8. Birsa Agricultural University.

www.baujharkhand.org

9. Central Agricultural University.

www.cau.org.in

10. Chandra Shekar Azad University of Agriculture & Technology.

www.csauk.ac.in

11. Chaudhary Charan Singh Haryana Agricultural University.

www.hau.ernet.in

12. Chhattisgarh Kamdhenu Vishwavidyalaya.

cgkv.ac.in

13. CSK Himachal Pradesh Krishi Vishvavidyalaya.

www.hillagric.ac.in

14. Dr Balasaheb Sawant Konkan Krishi Vidyapeeth.

www.dbskkv.org

15. Dr Panjabrao Deshmukh Krishi Vidyapeeth.

www.pdkv.ac.in

16. Dr Yashwant Singh Parmar Univ of Horticulture & Forestry.

www.yspuniversity.ac.in

17. Uttar Banga Krishi Viswavidyalaya, West Bengal.

www.ubkv.ac.in

18. Govind Ballabh Pant University of Agriculture & Technology.

www.gbpuat.ac.in

19. Indira Gandhi Krishi Vishwavidyalaya.

www.igau.edu.in

20. Jawaharlal Nehru Krishi Vishwa Vidyalaya.

www.jnkvv.nic.in

21. Junagadh Agricultural University.

www.jau.in

22. Kerala Agricultural University.

www.kau.edu

23. Maharana Pratap Univ. of Agriculture & Technology.

www.mpuat.ac.in

24. Mahatma Phule Krishi Vidyapeeth.

www.mpkv.ac.in

25. Manyavar Shri Kanshiram Ji University of Agriculture and Technology.

mskjuat.edu.in

26. Marathwada Agricultural University.

http://mkv2.mah.nic.in

27. Narendra Deva University of Agriculture & Technology.

www.nduat.in

28. Navsari Agricultural University.

www.nau.in

29. Orissa Univ. of Agriculture & Technology.

www.ouat.ac.in

30. Punjab Agricultural University.

www.pau.edu

31. Rajendra Agricultural University.

rauabm.org.in

32. Rajmata Vijayraje Sciendia Krishi Vishwa Vidyalaya.

www.rvskvv.net

33. Sardar Vallabhbhai Patel University of Agriculture and Technology.

www.svbpmeerut.ac.in

34. Sardar Krushinagar Dantiwada Agricultural University.

www.sdau.edu.in

35. Sher-e-Kashmir Univ of Agricultural Sciences & Technology, Jammu.

www.skuast.org

36. Sher-e-Kashmir Univ of Agricultural Sciences & Technology of Kashmir.

www.skuastkashmir.ac.in

37. Swami Keshwanand Rajasthan Agricultural University.

raubikaner.org

38. Tamil Nadu Agricultural University.

www.tnau.ac.in

39. University of Agricultural Sciences, Bangalore.

www.uasbangalore.edu.in

40. University of Agricultural Sciences, Dharwad.

www.uasd.edu

41. University of Agricultural Sciences, Shimoga.

uahs.in

42. University of Horticultural Sciences, Karnataka.

uhsbagalkot.edu.in

43. University of Agricultural Sciences, Raichur.

www.uasraichur.edu.in

44. Uttarakhand University of Horticulture and Forestry

www.uuhf.ac.in

45. Uttar Banga Krishi Viswavidyalaya, West Bengal

www.ubkv.ac.in

Posted Date: 09-11-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌