• facebook
  • whatsapp
  • telegram

చ‌క్కెర కోర్సుల‌తో చ‌క్క‌టి కొలువులు

పీజీ, పీజీ డిప్లొమా, స‌ర్టిఫికెట్ కోర్సుల ప్ర‌వేశాలకు ప్ర‌క‌ట‌న‌

చెరకు నుంచి చక్కెర ఉత్పత్తి చేయడంలో సాంకేతికతా, నిపుణుల శ్రమా దాగి ఉన్నాయి. అలాగే చెరకు నుంచి ఇతర ద్రావణాలూ తయారు చేయవచ్చు. వీటి గురించి తెలుసుకుని ఈ రంగంలో రాణించడానికి కొన్ని కోర్సులున్నాయి. అవి పూర్తిచేసుకున్నవారు పంచదార, ఆల్కహాల్‌ తయారీ సంస్థల్లో ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. దేశంలో అతి కొద్ది విద్యాసంస్థలు మాత్రమే ఈ తరహా చదువులు అందిస్తున్నాయి. అందులో పుణెలోని వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. ఈ సంస్థ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులు నడుపుతోంది. ప్రవేశాలకు ప్రకటనను వెలువరించింది!

పంచదార, అనుబంధ పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరులను అందించడానికి వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1975లో పుణె దగ్గరలో నెలకొల్పారు. సావిత్రీభాయ్‌ ఫూలే యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ కొన్ని జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందిస్తున్నారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. దేశంలో పేరొందిన పంచదార పరిశ్రమలు, స్పిరిట్, డిస్టిలరీ, బ్రూవరీలు, బేవరేజ్‌లు, ఇతర సంస్థలు వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కోర్సులో ప్రవేశానికి వంద మార్కులకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆయా కోర్సును అనుసరించి జనరల్‌ కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్‌ ఇంగ్లిష్, మ్యాథ్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. 

ఎమ్మెస్సీ

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌: మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా ఏదైనా సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీటెక్‌ సివిల్‌/ కెమికల్‌ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 24 సీట్లు ఉన్నాయి. 
వైన్, బ్రూవింగ్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీ వైన్‌ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ కెమిస్ట్రీ/ అగ్రికల్చర్‌/ బోటనీ/ జువాలజీ/ పీజీడీఐఎఫ్‌ఏటీ లేదా బీటెక్‌ కెమికల్‌/ బయో టెక్నాలజీ/ ఫుడ్‌/ అగ్రి బయోటెక్‌ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 24 సీట్లు ఉన్నాయి. 

పీజీ డిప్లొమా 

షుగర్‌ టెక్నాలజీ: బీఎస్సీ షుగర్‌ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎంపీసీ లేదా బీటెక్‌ కెమికల్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. 50 సీట్లు ఉన్నాయి.

షుగర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ: ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. 15 సీట్లు ఉన్నాయి. బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్‌ కోర్సులు చదివినవారు అర్హులు. బీటెక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎల్రక్టికల్‌/ ఎల్రక్టానిక్స్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

షుగర్‌ ఇంజినీరింగ్‌: బీటెక్‌ మెకానికల్‌/ ఎల్రక్టికల్‌/ కెమికల్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి 18 నెలలు. 15 సీట్లు ఉన్నాయి. 

ఇండ[స్టియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీలో కెమిస్ట్రీ/ వైన్‌ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ ఆల్కహాల్‌ టెక్నాలజీ చదివుండాలి లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి 22 నెలలు. సీట్లు 120.

సర్టిఫికెట్‌

షుగర్‌ బాయిలింగ్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం లేదా ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 60.

జ్యూస్‌ సూపర్‌విజన్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 30.

ఈటీపీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనన్స్‌: ఇంటర్‌తోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం అవసరం. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 30. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: www.vsisugar.com

Posted Date: 24-05-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌