• facebook
  • whatsapp
  • telegram

మరో మూడు ఐఐఎంల‌లో ఎంబీఏ

 ఇంట‌ర్మీడియ‌ట్, ప్ర‌వేశ‌ప‌రీక్ష‌తో చేరే అవ‌కాశం

దేశంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ప్రధానమైనది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ). అలాంటి కోర్సును ఐఐఎం లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చేస్తే ఉన్నతమైన కెరియర్‌ను అందుకోవచ్చు. ఇప్పటి వరకు అయిదేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏను ఐఐఎం-ఇండోర్‌, ఐఐఎం-రోహ్‌త‌క్ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు మరో మూడు ఐఐఎం(బోధ్‌గ‌యా, జ‌మ్మూ, రాంచీ)లు కూడా ఈ జాబితాలో చేరాయి. ఇంటర్మీడియట్ అర్హతతో వీటిలో చేరవచ్చు. 

దేశ వ్యాప్తంగా 20 ఐఐఎంలు ఉన్నాయి. వీటిలో కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే రిక్రూట్ చేసుకోడానికి పెద్ద పెద్ద సంస్థ‌లు పోటీ పడుతున్నాయి. వేత‌నం ల‌క్ష‌ల్లో అందుకోవ‌చ్చు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) పేరుతో నిర్వహించే ఈ కోర్సు వేగంగా ఆదరణ పెంచుకుంటోంది. 
 

కోర్సు తీరు!

ఇందులో మొద‌టి మూడేళ్లు అంటే ఆరు సెమిస్ట‌ర్లు ఆయా ఐఐఎంల‌ను బ‌ట్టి ఫౌండేష‌న్ కోర్సుల‌ను అందిస్తారు. ఆరో సెమిస్ట‌ర్ త‌ర్వాత చివ‌రి రెండేళ్లు బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్య ఉంటుంది. మొత్తంగా ఈ కోర్సు ద్వారా సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ‌మేటిక్స్ (స్టెమ్‌) అంశాల‌కు చెందిన విద్య‌నందిస్తారు. తొలి మూడేళ్ల‌కు ఫీజు రూ.4.5 ల‌క్ష‌లు ఉంటుంది. చివ‌రి రెండేళ్లు రూ.7.5 ల‌క్ష‌లు చెల్లించాలి. ఆయా ఇన్‌స్టిట్యూష‌న్ల‌ను బ‌ట్టి ఫీజులో స్వ‌ల్ప మార్పులుంటాయి. ఈ ఏడాదికి సంబంధించి జ‌మ్మూ ఇన్‌స్టిట్యూట్‌లో 60 సీట్లు, బోధ్‌గ‌యాలోనూ 60 సీట్లు ఉండ‌గా ఇందులో ప‌ది సీట్లును ప్ర‌త్యేకంగా మ‌హిళా అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తారు. రాంచీ ఇన్‌స్టిట్యూట్ 120 మంది విద్యార్థుల‌కు ప్ర‌వేశం క‌ల్పించ‌నుంది. 

కనీస అర్హ‌త‌లు

ఈ కోర్సుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ హెచ్ఎస్‌సీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా తరగతులకు సంబంధించి ఆ సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప‌దో త‌ర‌గ‌తిలో కూడా 60శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించ‌డం త‌ప్ప‌నిస‌రి. 

ఎంపిక ఎలా చేస్తారు?

సంస్థలు నిర్దేశించే నిబంధనలకు అనుగుణంగా ఎంపికలు ఉంటాయి. ఐఐఎం-బోధ్‌గ‌యా, ఐఐఎం-జ‌మ్మూ జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (జిప్‌మ్యాట్‌) స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. దీనికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హిస్తుంది. ఇక ఐఐఎం-రాంచీ, శాట్ లేదా ఐఐఎం-ఇండోర్ నిర్వ‌హించే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐపీమ్యాట్‌) ప‌రీక్ష స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తుంది. వీటితోపాటు అక‌డ‌మిక్ ప్ర‌తిభ‌ను కూడా ఐఐఎంలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి. 

ఐఐఎంల అధికారిక‌ వెబ్‌సైట్‌లు: https://iimranchi.ac.in/ 

http://iimbg.ac.in/ 

http://www.iimj.ac.in/

జిప్‌మ్యాట్-2021 నోటిఫికేష‌న్‌ కోసం క్లిక్ చేయండి

Posted Date: 02-04-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌