• facebook
  • whatsapp
  • telegram

నైపుణ్య శిక్ష‌ణ‌.. ఉపాధికి నిచ్చెన‌!

ఎన్‌ఎస్‌టీఐ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక‌లు

దేశంలోని మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించి ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి రంగాల్లో రాణించేలా భార‌త నైపుణ్యాభివృద్ధి, ఆంత్ర‌పెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ ట్రెయినింగ్‌(డీజీటీ).. క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్‌స్కీమ్‌(సీటీఎస్‌) అనే ఉమెన్స్ ఒకేష‌న‌ల్ ట్రెయినింగ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని ద్వారా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూనే.. పురుషుల‌కూ ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ ట్రేడుల్లో శిక్ష‌ణ ఇస్తారు. 

దేశ వ్యాప్తంగా మొత్తం 33 జాతీయ నైపుణ్య శిక్ష‌ణ కేంద్రాలు ఉండ‌గా.. 19 కేంద్రాల‌ను ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కు కేటాయించారు. మిగ‌తా 14 కేంద్రాల్లో అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తారు. ఇవి సీటీఎస్‌ ఆగస్టు 2021 సెషన్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని రామంతపూర్‌, విద్యాన‌గ‌ర్‌లో నేషనల్‌ స్కిల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌టీఐ) కేంద్రాలున్నాయి. దేశ‌వ్యాప్తంగా మొత్తం 4432 సీట్లున్నాయి. వీటిలో రెగ్యుల‌ర్ కోర్సుల్లో 2816 ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా న్యూ ఏజ్ కోర్సుల్లో 728 కేటాయించారు. జ‌న‌ర‌ల్ విభాగంలో మొత్తం 820 ఉన్నాయి. ఇక రామంతాపూర్‌, విద్యాన‌గ‌ర్‌లో రెండు కేట‌గిరీల్లో క‌లిపి 160 సీట్లు ఉన్నాయి. సీటీఎస్(మ‌హిళ‌) కోర్సులో ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌(స్మార్ట్ అగ్రిక‌ల్చ‌ర్‌)లో 24, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియ‌న్‌లో 24 సీట్లు కేటాయించారు. అలాగే జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి సంబంధించి విద్యాన‌గ‌ర్‌లో సోలార్ టెక్నీషియ‌న్(ఎల‌క్ట్రిక‌ల్‌)-20, జియో ఇన్ఫ‌ర్మాటిక్స్‌, మెషినిస్ట్‌సీట్లున్నాయి. రామంతాపూర్‌లో ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నీషియ‌న్‌(స్మార్ట్ హెల్త్‌కేర్)-24, రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌(డ్రోన్ పైలెట్‌)-24 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల వ్య‌వ‌ధి రెండేళ్లు ఉంటుంది. 

క్రాఫ్ట్స్‌మెన్‌ట్రెయినింగ్‌స్కీం (సీటీఎస్‌)

మ‌హిళా ఎన్ఎస్‌టీఐలో కోర్సులు: బ్యూటీ & వెల్‌నెస్‌, ఎల‌క్ట్రానిక్స్ & హార్డ్ వేర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఐటీఈఎస్‌, టెక్స్‌టైల్ & అప్పారెల్‌, ట్రావెల్ టూరిజం, క్యాట‌రింగ్ & హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చ‌ర్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌, డెస్క్‌టాప్ ప‌బ్లిషింగ్.

జ‌న‌ర‌ల్ ఎన్ఎస్‌టీఐలో కోర్సులు: జియో ఇన్ఫర్మాటిక్స్‌అసిస్టెంట్‌, సాయిల్‌టెస్టింగ్‌అండ్‌క్రాప్‌టెక్నీషియన్‌, ఆడిటివ్ మ్యానుఫాక్చ‌రింగ్ టెక్నీషియ‌న్‌(3డీ ప్రింటింగ్‌), రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌(డ్రోన్ పైలెట్‌), ఎలక్ట్రీషియన్‌పవర్‌డిస్ట్రిబ్యూషన్, సోలార్‌టెక్నీషియన్‌(ఎల‌క్ట్రిక‌ల్‌), టెక్నీషియ‌న్ మెకాస్ట్రానిక్స్‌, ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ అగ్రిక‌ల్చ‌ర్‌), ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ హెల్త్‌కేర్‌), ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ సిటీ), స్మార్ట్ ఫోన్ టెక్నీషియ‌న్ క‌మ్ యాప్ టెస్ట‌ర్ ట్రేడులు ఉన్నాయి. వీటిలో రెగ్యుల‌ర్ కోర్సుల‌తోపాటు న్యూ ఏజ్ కోర్సుల‌ని కూడా చేర్చారు. అభ్య‌ర్థులు ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకుంటే డ్యుయ‌ల్ సిస్ట‌మ్ ఆఫ్ ట్రెయినింగ్‌(డీఎస్‌టీ) స్కీమ్ కింద శిక్ష‌ణ ఇస్తారు. 

రెగ్యుల‌ర్ కోర్సులు: ట‌ర్న‌ర్‌, వెల్డ‌ర్‌, ఫౌండ్రీమెన్‌, మెషినిస్ట్‌, టూల్ అండ్ డైమేక‌ర్‌, సెక్ర‌టేరియ‌ల్ ప్రాక్టీస్ (ఇంగ్లిష్‌), ఆర్కిటెక్చ‌రల్ డ్రాట్స్‌మెన్‌, కాస్మొటాల‌జీ, క్యాట‌రింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్‌, కంప్యూట‌ర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడ‌రీ & డిజైనింగ్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ & ప్రొగ్రామింగ్ అసిస్టెంట్‌, డెస్క్‌టాప్ ప‌బ్లిషింగ్ ఆప‌రేట‌ర్, డ్రాట్స్‌మెన్ సివిల్‌, డ్రెస్ మేకింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఫ్యాష‌న్ డిజైన్ & టెక్నాల‌జీ, ఫుడ్ ప్రొడ‌క్ష‌న్‌, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్‌, ఫ్రూట్స్ & వెజిటెబుల్స్ ప్రాసెసింగ్‌, ఇంటీరియ‌ర్ డిజైన్ & డెక‌రేష‌న్‌, సెక్ర‌టేరియ‌ల్ ప్రాక్టీస్, స్టెనోగ్రాఫ‌ర్ సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌, ట్రావెల్ & టూర్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్ మెకాట్రానిక్స్‌, ఎల‌క్ట్రీషియ‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్‌, సోలార్ టెక్నీషియ‌న్‌(ఎల‌క్ట్రిక‌ల్‌), ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ అగ్రిక‌ల్చ‌ర్‌), ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ హెల్త్‌కేర్‌), ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్‌(స్మార్ట్ సిటీ), సాయిల్‌టెస్టింగ్‌అండ్‌క్రాప్‌టెక్నీషియన్‌, ఆడిటివ్ మ్యానుఫాక్చ‌రింగ్ టెక్నీషియ‌న్‌(3డీ ప్రింటింగ్‌), రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌(డ్రోన్ పైలెట్‌), స్మార్ట్ ఫోన్ టెక్నీషియ‌న్ క‌మ్ యాప్ టెస్ట‌ర్, జియో ఇన్ఫర్మాటిక్స్‌ అసిస్టెంట్‌.

ఇదీ అర్హత

అభ్య‌ర్థులు ఎంచుకునే ట్రేడును బ‌ట్టి అర్హ‌త ఉంటుంది. డ్రెస్ మేకింగ్ అండ్ వెల్డ‌ర్ ట్రేడ్‌కు ఎనిమిదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణ‌త‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌అసిస్టెంట్‌కు పదో తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెక్ర‌టేరియ‌ల్ ప్రాక్టీస్ ట్రేడ్‌కు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం త‌ప్ప‌నిస‌రి. వ‌య‌సు శిక్ష‌ణ ప్రారంభం నాటికి 14 ఏళ్లు పూర్త‌వ్వాలి. 

ఎంపిక విధానం

అభ్య‌ర్థి అకడమిక్ ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కేంద్ర రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తిస్తాయి. 

దరఖాస్తు ఇలా.. 

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు జులై 30, 2021 తుది గ‌డువు. ద‌ర‌ఖాస్తు రుసుము ఇత‌రులు రూ.50 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రుసుము లేదు. 

కోర్సులో చేరిన తర్వాత‌..

ఎంపికైన అభ్య‌ర్థులు చెల్లించాల్సిన ఫీజు వివ‌రాలిలా...
ఫీజు ఇత‌రులు ఎస్సీ/ ఎస్టీ/ ఈడ‌బ్ల్యూఎస్‌

ప్ర‌వేశ ఫీజు

ట్యూష‌న్(నెల‌కు)       

ప‌రీక్ష 

జిమ్‌ఖానా

డూప్లికేట్ స‌ర్టిఫికెట్

హాస్ట‌ల్ నెల‌కు

హాస్ట‌ల్ స‌ర్వీస్ ఛార్జీ

రూ.100

రూ.150

రూ.100/ రూ.200

రూ.100

రూ.100

రూ.100

రూ.50

రూ.25

రూ.50

రూ.25/ రూ.50

లేదు

రూ.50

రూ.100

రూ.50

వెబ్‌సైట్‌: https://msde.gov.in/
 

Posted Date: 20-07-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌