• facebook
  • whatsapp
  • telegram

ఆర్ట్స్ గ్రూపులు

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం మొదలైంది.
 

దీంతో ఆర్ట్స్ గ్రూపులకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల విషయంలో చరిత్ర పునరావృతమవుతోందా? అనే సందేహం కలుగుతుంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌