• facebook
  • whatsapp
  • telegram

ట్రేడ్ల వివ‌రాలు

ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది; నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
 

ఇంజినీరింగ్ (రెండేళ్ల కాలవ్యవధి): అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్‌టెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్), రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్‌టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్.
 

ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు: పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)


నాన్ ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు: బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, లిథో- ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ప్లంబర్, ప్రి ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్), వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్).
 

నాన్ఇంజినీరింగ్ 6 నెలల ట్రేడ్లు: డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ), హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.
 

సీఓఈ ట్రేడ్లు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్‌టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుమూ లేకుండా ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఉంటుంది. ఐటీఐలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల కిందట ఏటా 10 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఏటా సుమారు లక్షమంది విద్యార్థులు చేరుతున్నారని అంచనా. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు కనీసం రూ.6000 నుంచి రూ.10000 వరకు నెలవారీ వేతనాలతో ఉపాధి పొందడానికి అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి.

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌