• facebook
  • whatsapp
  • telegram

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు

ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయం/ విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సును తెలుగు మీడియంలో, మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సును ఇంగ్లిషు మీడియంలో నిర్వహిస్తోంది.

పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.angrau.ac.in సందర్శించవచ్చు.

ఈ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు విరివిగా ఉన్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. ప్రైవేటు రంగంలో విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో, సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. స్వయం ఉపాధి పొందవచ్చు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏటా విశ్వవిద్యాలయం 'అగ్రిసెట్‌' నిర్వహించి నేరుగా B.Sc (Ag)లో ప్రవేశాల్ని కల్పిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం

పశుసంవర్థక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ వర్శిటీ పశు సంవర్థక, మత్స్యశాస్త్ర పరిజ్ఞాన పాలిటెక్నిక్‌లలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను తెలుగు మీడియంలో నిర్వహిస్తోంది. పశు సంవర్థక పాలిటెక్నిక్‌లు 10 ఉండగా, 205 సీట్లున్నాయి. మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ ఒకటి ఉండగా దానిలో 30 సీట్లున్నాయి. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారికి పశు సంవర్థ్ధక, మత్స్య శాఖల్లో సహాయకులుగా, డెయిరీ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, హేచరీల నిర్వహణలో, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో ఉపాధి అవకాశాలున్నాయి.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం

ఈ యూనివర్శిటీ ఉద్యాన పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సును నిర్వహిస్తోంది. ఆరు పాలిటెక్నిక్‌లు ఉండగా 155 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో ఉత్తీర్ణులైతే ఉద్యాన వనాలు, విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్‌ రంగం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ఉపాధి అవకాశాలుంటాయి. ఈ కోర్సు పూర్తిచేసినవారికి హార్టిసెట్‌ ద్వారా B.Sc (Hons) Hort.లో ప్రవేశాలు లభిస్తాయి.

వివరాలకు www.drysrhu.edu.in ను సందర్శించవచ్చు.

Posted Date: 30-06-2021


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌