• facebook
  • whatsapp
  • telegram

గ్రూపులు - కాంబినేష‌న్లు

ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి

కొన్ని ప్రధానమైన గ్రూపులు
ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు చాలా తక్కువ కళాశాలల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు మ్యూజిక్ సబ్జెక్టు విశాఖపట్నంలో మాత్రమే ఉంది. ఈ తరహా కాంబినేషన్లు కొన్ని..
హిస్టరీ, ఎకనమిక్స్, కామర్స్
హిస్టరీ, సివిక్స్,

సోషియాలజీ
హిస్టరీ, ఎకనమిక్స్, మ్యూజిక్
హిస్టరీ, ఎకనమిక్స్, సైకాలజీ
హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ
ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.

బోర్డు అందిస్తున్న గ్రూపుల్లో పైన పేర్కొన్న పదకొండు గ్రూపుల్లోనే విద్యార్థులు చేరుతున్నారు. వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా 'తన అభిరుచి ఏమిటి? లక్ష్యం ఏమిటి? అది సాధించేందుకు ఇప్పటి నుంచి ఏం చేయాలి తదితర ప్రశ్నలకు విద్యార్థి సంతృప్తికరమైన సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి

Posted Date: 14-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌