• facebook
  • whatsapp
  • telegram

బ‌యోటెక్నాల‌జీ

జంతువులు, మొక్కల్లో కోరిన మార్పులు చేయ‌డం లేదా వివిధ ప్రయోజ‌నాల కోసం సూక్ష్మజీవుల‌ను ఉత్పత్తి చేయ‌డం, ఆర్థికప‌రంగా వాటిని ఉప‌యోగించ‌డాన్ని జీవ‌సాంకేతిక‌శాస్త్రమ‌ని అంటారు. ఫార్మాస్యూటికల్, డయాగ్నోస్టిక్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంటల్ త‌దిత‌ర‌ రంగాలకు ఉపకరించే ఉత్పత్తులను బయోటెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. దీనిలో ర‌సాయ‌న శాస్త్రం, గ‌ణితం, ఇంజినీరింగ్‌తో పాటు ఆరోగ్యం, వైద్యం, వ్యవ‌సాయం, ప‌శుసంవ‌ర్ధకం, ప‌ర్యావ‌ర‌ణం, క‌ణ‌జీవ‌శాస్త్రం, మెరైన్ బ‌యాల‌జీ త‌దిత‌ర అంశాలున్నాయి. మొక్కలు, జంతువులకు సంబంధించిన‌ జన్యు సమాచారాన్ని అభివృద్ధి పరిచి, మానవాళికి మేలు చేకూర్చడంలో బయోటెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది.

కోర్సుల వివ‌రాలు

ఇంట‌ర్మీడియ‌ట్ సైన్స్ గ్రూప్‌ (ఎంపీసీ / బైపీసీ) వారికి ప‌రీక్షల ద్వారా ప‌లు ఐఐటీలు, విశ్వవిద్యాల‌యాలు బీఎస్సీ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ త‌దిత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తున్నాయి. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అనేక ప్రముఖ సంస్థల్లో బయోటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌- సీబీఈఈ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ప్రకటన సాధారణంగా మార్చిలో వెలువడుతుంది.

 డిగ్రీ / పీజీ స్థాయి కోర్సులు

*  బీఎస్సీ (బ‌యోటెక్నాల‌జీ)

* బీఎస్సీ (బయోపార్మటిక్స్)

* బీటెక్ (బ‌యోటెక్నాల‌జీ)

* ఎంఎస్సీ (బ‌యోటెక్నాల‌జీ)

* ఎంఎస్సీ (అగ్రిక‌ల్చర్ బ‌యోటెక్నాల‌జీ)

* ఎంఎస్సీ / ఎంవీఎస్సీ (యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ)

* ఎంఎస్సీ (మెరైన్ బ‌యోటెక్నాల‌జీ)

* ఎంఎస్సీ (మెడిక‌ల్ బ‌యోటెక్నాల‌జీ)

* ఎంటెక్ (బ‌యోటెక్నాల‌జీ)

* ఎంటెక్ (బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్ / బ‌యోటెక్నాల‌జీ)

* ఎంబీఏ (బ‌యెటెక్నాల‌జీ)

*¤ గోవా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. మెరైన్‌ బయోటెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నాయి.

* ¤ సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీని అందిస్తోంది.

* ¤ అస్సాంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌సి. మాలెక్యులర్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ ఉంది.

* ¤ పుణే యూనివర్సిటీ రెండేళ్ళ ఎంబీఏ బ‌యోటెక్నాల‌జీ, జేఎన్‌యూ, జిప్‌మ‌ర్ వ‌ర్సిటీలు బయోఫార్మటిక్స్ కోర్సుల‌ను అందిస్తున్నాయి. 

 ప‌రిశోధ‌నావ‌కాశాలు

   కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) ఏర్పాటైంది. కౌన్సెల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌, న్యూఢిల్లీ) పరిధిలోని సంస్థల్లో బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధనలు జరుగుతున్నాయి.

 తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ / పీజీ స్థాయిలో బ‌యోటెక్నాల‌జీ కోర్సును అందించే విశ్వవిద్యాల‌యాలు

* యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ - హైద‌రాబాద్‌

http://www.uohyd.ac.in/

* ఉస్మానియా విశ్వవిద్యాల‌యం - హైద‌రాబాద్‌

http://www.osmania.ac.in/

కాక‌తీయ విశ్వవిద్యాల‌యం - వ‌రంగ‌ల్‌

http://www.kakatiya.ac.in/

* ఆంధ్రా విశ్వవిద్యాల‌యం - విశాఖ‌ప‌ట్నం

http://www.andhrauniversity.edu.in/

* శ్రీ వెంక‌టేశ్వర విశ్వవిద్యాల‌యం - తిరుప‌తి

http://svuniversity.ac.in/

* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల‌యం - గుంటూరు

http://www.nagarjunauniversity.ac.in/

* ఆదిక‌వి న‌న్నయ విశ్వవిద్యాల‌యం - రాజ‌మండ్రి

http://www.nannayauniversity.info/

* శ్రీ కృష్ణ దేవ‌రాయ విశ్వవిద్యాల‌యం - అనంత‌పురం

http://skuniversity.org/

* శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం - తిరుప‌తి

http://www.spmvv.ac.in/

* ద్రావిడ విశ్వవిద్యాల‌యం - కుప్పం

http://www.dravidianuniversity.ac.in/

* కృష్ణా విశ్వవిద్యాల‌యం - మ‌చిలీప‌ట్నం

http://www.krishnauniversity.ac.in/

* రాయ‌ల‌సీమ విశ్వవిద్యాల‌యం - క‌ర్నూలు

http://www.rayalaseemauniversity.ac.in

* జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - హైద‌రాబాద్‌

http://www.jntuh.ac.in/new/

* జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - కాకినాడ‌

http://www.jntuk.edu.in/

* జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల‌యం - అనంత‌పురం

http://jntua.ac.in/

 జాతీయ స్థాయిలో డిగ్రీ , పీజీ కోర్సునందిచే ముఖ్య సంస్థలు / విశ్వవిద్యాల‌యాలు

* ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ - న్యూ ఢిల్లీ

http://www.aiims.edu/

* పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ - ఛండీఘ‌ర్

http://pgimer.edu.in/

* సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ - ల‌క్నో

http://sgpgi.ac.in/

* జిప్‌మ‌ర్ - పాండిచ్చేరి

http://jipmer.edu.in/

* ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగ‌ళూరు

http://iisc.ernet.in/

* ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ - ముంబ‌యి, ఢిల్లీ, కాన్పూర్‌

http://www.jnu.ac.in/

* ఎంఎస్ విశ్వవిద్యాల‌యం - బ‌రోడ‌

http://www.msubaroda.ac.in/

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యో ఇన్‌ఫార్మేటిక్స్ అండ్ బ‌యోటెక్నాల‌జీ - బెంగ‌ళూరు

http://www.ibab.ac.in/

* త‌మిళనాడు అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ - కోయంబ‌త్తూరు

http://tnau.ac.in/

* అన్నామ‌లై విశ్వవిద్యాల‌యం - చెన్నై

http://annamalaiuniversity.ac.in

* నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియ‌న్ టెక్నాల‌జీ - చెన్నై

http://niot.res.in/

* బెనార‌స్ హిందూ విశ్వవిద్యాల‌యం - వార‌ణాసి

http://www.bhu.ac.in/

* యూనివ‌ర్సిటీ ఆఫ్ అలహాబాద్ - అలహాబాద్

http://www.allduniv.ac.in/

* జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల‌యం - న్యూ ఢిల్లీ

http://www.jnu.ac.in/

* యూనివ‌ర్సిటీ ఆఫ్ ల‌క్నో - ల‌క్నో

http://www.lkouniv.ac.in/

Posted Date: 19-03-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌