• facebook
  • whatsapp
  • telegram

కానిస్టేబుల్ రాత పరీక్ష విధానం

జనరల్ స్టడీస్: ఈ విభాగం నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు.

మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్: ఈ విభాగం నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు.

జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో 25 ప్రశ్నలుంటాయి.

పార్ట్ - ఎ : జనరల్ స్టడీస్ విభాగం సైన్స్ విద్యార్థులకు కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది. కానీ మనసు పెట్టి చదివితే దీనిపై త్వరగా పట్టు సాధించవచ్చు. జనరల్ స్టడీస్‌లోని హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్‌ల కోసం తెలుగు అకాడెమీ పుస్తకాలు, 3 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలు చక్కగా ఉపయోగపడతాయి.

పార్ట్ - బి : మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ నుంచి నుంచి 75- 80 ప్రశ్నలడుగుతారు. దీన్ని ఆర్ట్స్ విద్యార్థులు కఠినంగా భావిస్తుంటారు. కానీ సరైన శిక్షణ, దిశానిర్దేశంతో ప్రాథమిక అంశాలు నేర్చుకుని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే పట్టు సాధించవచ్చు. ఉద్యోగ నియామకంలో ఈ విభాగం నిర్ణయాత్మకమైంది.

పార్ట్ - సి: జనరల్ ఇంగ్లిష్‌ను గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తుంటారు. 'ఈ అంశం వదిలేసి మిగిలిన టాపిక్స్ చదువుకుందాం అనే ధోరణిలో ఆలోచిస్తారు. ఉద్యోగం పొందడంలో ప్రతి అంశం ముఖ్యమే కాబట్టి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ఈ విభాగంలో వ్యాకరణంలోని అంశాలైన Synonyms, antonyms, spellings, one word substitutions, comprehension passage, articles, prepositions, tenses, voice, question tags.... అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. గత పరీక్షల్లో ఎక్కువగా Synonyms, antonyms, tenses, spellings, comprehension passage లపై ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. వీటి కోసం 8, 9, 10 తరగతుల్లోని వ్యాకరణ అంశాలు ఉపయోగపడతాయి.

Posted Date: 12-03-2021


 

ఉద్యోగ ప‌రీక్ష‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌